అవన్నీ రూమర్స్‌ : నిర్మాత సురేష్ బాబు | Venkatesh Brother Suresh Babu has Issued A Statement about the Vikram Vedha Remake | Sakshi
Sakshi News home page

అవన్నీ రూమర్స్‌ : నిర్మాత సురేష్ బాబు

Published Tue, May 7 2019 12:52 PM | Last Updated on Tue, May 7 2019 12:52 PM

Venkatesh Brother Suresh Babu has Issued A Statement about the Vikram Vedha Remake - Sakshi

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌ మళ్లీ స్పీడు పెంచారు. ఇటీవల లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న వెంకటేష్‌ ఎఫ్‌2తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమాలో నటిస్తున్న విక్టరీ హీరో ఓ కోలీవుడ్ సూపర్‌ హిట్‌ను తెలుగు రీమేక్‌ చేయనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మాధవన్‌, విజయ్‌ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన విక్రమ్‌ వేదా సినిమాను వెంకటేష్‌, నారా రోహిత్‌లు రీమేక్ చేస్తున్నారంటు ఫిలిం సర్కిల్స్‌ లో ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ వార్తలపై నిర్మాత సురేష్‌ బాబు క్లారిటీ ఇచ్చారు. ‘వెంకటేష్‌ తమిళ సినిమా విక్రమ్‌ వేదాను టాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజంలేదు. వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ సినిమా మాత్రమే చేస్తున్నారు. తదుపరి చిత్రాల వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement