సోషల్ మీడియా వేదికగా తన ప్రేమ విషయాన్ని వెల్లడించిన హీరో రానా చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. హైదరాబాద్‌కు చెందిన మిహీక బజాజ్‌ను ప్రేమిస్తున్నానని.. ఆమె ఒకే చెప్పిందని రానా ప్రకటించారు. దీంతో టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న రానా.. ఓ ఇంటివాడు కాబోతుండటంతో పలువురు సినీ ప్రముఖులు రానాకు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా రానా ప్రేమ, పెళ్లిపై ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించారు. బాంబే టైమ్స్‌తో మాట్లాడిన సురేష్ బాబు... రానా నిశ్చితార్థం గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాదిలోనే రానా పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. (చదవండి : రానా ప్రేయసి మిహీకా వివరాలు ఇవే..)
‘రానా, మిహీకాలు చాలా కాలంగా ఒకరికొకరు తెలుసు. వారిద్దరు ఒకటి కావాలని నిర్ణయం తీసుకోవడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను సరైన సమయంలో వెల్లడిస్తాం. ఈ ఏడాదిలోనే వారి పెళ్లి జరుగుతుంది. డిసెంబర్‌లో పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాం.. కానీ అంతకు ముందే జరిగే అవకాశం కూడా ఉంది. అన్ని ఖరారు అయ్యాక వివరాలు వెల్లడిస్తాం. ఈ లాక్‌డౌన్ సమయంలో మేము ఖాళీగా ఉండకుండా.. పిల్లలు మాకు పని కల్పించారు. మేము ఇప్పుడు పెళ్లికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాం’ అని సురేష్ బాబు తెలిపారు. మరోవైపు రానా, మిహీకా కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్టు బాంబే టైమ్స్ పేర్కొంది. (చదవండి : ఆమె యస్ చెప్పింది : రానా)
Comments
Please login to add a commentAdd a comment