‘సిస్టర్‌.. ఎంకరేజ్‌ న్యూ టాలెంట్‌.. ప్లీజ్‌’ | Tharun Bhascker New Film Ee Nagaraniki Emaindi Trailer | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 10 2018 10:42 AM | Last Updated on Sun, Jun 10 2018 3:46 PM

Tharun Bhascker New Film Ee Nagaraniki Emaindi Trailer - Sakshi

తొలి చిత్రం పెళ్లి చూపులు సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌. లఘు చిత్ర నేపథ్యం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ యువ దర్శకుడు తొలి సినిమాతోనే మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తొలి చిత్రం ఘనవిజయం సాధించినా.. రెండో సినిమాను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు తరుణ్. తన రెండో సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రూపొందిస్తున్నారు.

తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో పాపులర్‌ అయిన ఈ నగరానికి ఏమైంది..? అనే పదాన్నే సినిమా టైటిల్‌ గా తీసుకున్న తరుణ్‌ భాస్కర్‌ మరోసారి విభిన్న కథా కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నూతన నటీనటులు విశ్వక్‌ సేన్‌, సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌, వెంకటేష్‌లతో పాటు అనీషా ఆంబ్రోస్‌, సిమ్రాన్‌ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement