pelli chupoolu
-
‘రౌడీ’ బ్యానర్లో హీరోగా తరుణ్..!
టాలీవుడ్ ప్రేక్షకులను రౌడీగా అలరిస్తున్న యువ నటుడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాలో సంచలనం సృష్టించిన విజయ్, రౌడీస్ అని ప్రేమగా పిలుస్తూ అభిమానులకు మరింత చేరువయ్యాడు. ఇటీవల విడుదలైన నోటా సినిమాతో నిర్మాతగా మారిన విజయ్, నిర్మాతగా తన తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. అంతేకాదు తన తదుపరి చిత్రంతో ఓ దర్శకుడిని హీరోగా పరిచయం చేయబోతున్నాడు విజయ్. ఇటీవల తన నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ హిల్ ను ప్రకటించిన విజయ్ దేవరకొండ తొలి ప్రయత్నం నోటా నిర్మాతలతో భాగస్వామిగా చేరాడు. రెండో ప్రయత్నంగా తనకు పెళ్లిచూపులు సినిమాతో హీరోగా బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై విజయ్ దేవరకొండ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
అంత పెద్ద ఆశ లేదంటున్న హాస్యనటుడు
పెళ్లిచూపులు సినిమాలో ఆయన చేసిన కామెడీని ఎంజాయ్ చేయని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయనకు ఆసినిమా జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తరువాత టాలీవుడ్లో వరుస చిత్రాలతో నవ్వుల పువ్వులు పూయిస్తున్న టాలీవుడ్ యువ కమెడియన్ ప్రియదర్శితో సాక్షి చిట్‌చాట్.. చదువు అనంతరం కష్టపడి సినీ అవకాశాలు పొందిన తాను, సినిమా పరిశ్రమలో ఉత్తమ కమిడియన్‌గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సాధించుకోవడమే తన లక్ష్యమని యువ హాస్యనటుడు ప్రియదర్శి పులికొండ అన్నారు. తండ్రి ఆచార్య పులికొండ సుబ్బాచారి పదవీ విరమణ కోసం ద్రవిడ విశ్వవిద్యాలయానికి వచ్చిన ఆయన్ను సాక్షి పలకరించింది. సాక్షి : సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి..? ప్రియదర్శి : షార్ట్ ఫిలిమ్‌ల ద్వారానే సినిమాలో అవకాశం వచ్చింది. దర్శకుడు తరుణŠ భాస్కర్ పెళ్ళిచూపులు సినిమాలో అవకాశం కల్పించారు. సాక్షి : మొదటి సినిమాకే అవార్డులు రావడం ఎలా అనిపించింది...? ప్రియదర్శి : మొదటి సినిమా పెళ్ళిచూపులు సినిమాకు జాతీయ స్థాయి అవార్డు రావడం మంచి గుర్తింపు లభించింది. జీవితంలో మరుపురాని సినిమాగా నాకు నిలిచిపోయింది. సాక్షి : ప్రస్తుతం ఏ సినిమాల్లో నటిస్తున్నారు...? ప్రియదర్శి : విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్‌ల మల్టీస్టారర్ సినిమా ఎఫ్2, పడిపడి లేచే మనసు, డూడ్, మిఠాయి సినిమాలలో నటిస్తున్నాను. వీటితో పాటు మరో ఐదు సినిమాల్లో నటిస్తున్నాను. సాక్షి : తమిళ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయా..? ప్రియదర్శి : తమిళంలో బైలింగువల్ సినిమాల్లో నటిస్తున్నాను. రీసెంట్గా స్పైడర్ సినిమాలో నటించాను. తమిళం నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. సాక్షి : హీరోగా ప్రేక్షకులను అలరించే అవకాశం ఉందా..? ప్రియదర్శి : అంత పెద్ద ఆశ లేదు గానీ.. సినీ పరిశ్రమలో ఉత్తమ నటుడుగా గుర్తింపు పొందాలని వుంది. సాక్షి : కుప్పంలో వాతావరణ ఎలా ఉంది.? ప్రియదర్శి : కుప్పం నాకు ప్రత్యేకమైంది. మా నాన్న గత 15 ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఇక్కడి వాతావరణం ఊ టీని తలపిస్తుంది. కుప్పం నాకు రెండో ఇళ్లు లాంటింది. సాక్షి : షార్ట్ ఫిలిమ్స్‌లో ఇంకా నటిస్తున్నారా..? ప్రియదర్శి : సినిమాల్లో అవకాశాలు వస్తుండంలో షార్ట్ ఫిలిమ్స్‌లో నటించడానికి సమయం దొరడం లేదు. సినిమాల్లో అవకాశం పొందడానికి షార్ట్ ఫిలిమ్స్ మంచి ఫ్లాట్‌ఫారం లాంటింది. -
‘సిస్టర్.. ఎంకరేజ్ న్యూ టాలెంట్.. ప్లీజ్’
తొలి చిత్రం పెళ్లి చూపులు సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. లఘు చిత్ర నేపథ్యం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ యువ దర్శకుడు తొలి సినిమాతోనే మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తొలి చిత్రం ఘనవిజయం సాధించినా.. రెండో సినిమాను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు తరుణ్. తన రెండో సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో పాపులర్ అయిన ఈ నగరానికి ఏమైంది..? అనే పదాన్నే సినిమా టైటిల్ గా తీసుకున్న తరుణ్ భాస్కర్ మరోసారి విభిన్న కథా కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నూతన నటీనటులు విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్, వెంకటేష్‌లతో పాటు అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. -
పెళ్లి చూపులు నిర్మాతల 'మెంటల్ మదిలో..'
-
పెళ్లి చూపులు నిర్మాతల 'మెంటల్ మదిలో..'
'పెళ్ళిచూపులు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం 'మెంటల్ మదిలో'. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకొన్న వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ లో కథ గురించి చెప్పిన విషయాలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. 'పెళ్ళిచూపులు' తరహాలోనే 'మెంటల్ మదిలో' కూడా ఘన విజయం సాధించాలని కోరుకొంటున్నాను. వివేక్ ఆత్రేయ ఓ సరికొత్త ప్రయత్నంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు' అన్నారు. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. 'సురేష్ బాబుగారు మా 'మెంటల్ మదిలో' ట్రైలర్ ను విడుదల చేసి.. క్వాలీటీ అండ్ కంటెంట్ చూసి మమ్మల్ని అభినందించడం చాలా ఆనందంగా ఉంది. చాలా పాజిటివ్ బజ్ ఉన్న సినిమా ఇది. మా టీం అంతా కూడా సినిమా రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. త్వరలోనే ఆడియో విడుదల చేసి.. విడుదల తేదీని ప్రకటిస్తాం' అన్నారు. -
దర్శకుడిగా మారుతున్న నిర్మాత
ఈ ఏడాదిలో చిన్న సినిమాగా విడుదలైన ఘనవిజయం సాధించిన చిత్రం పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకుడు. రాజ్ కందుకూరి నిర్మాతగా కేవలం 80 లక్షల బడ్జెట్ నిర్మించిన ఈ సినిమా, ఏకంగా 20 కోట్ల కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న రాజ్ కందుకూరి వరుసగా మూడు సినిమాలను ప్రకటించారు. పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా, విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుణ్ని పరిచయం చేస్తూ మరో సినిమాతో పాటు తానే స్వయంగా దర్శకుడిగా మారి ఓ సినిమాను తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. ఓ స్టార్ హీరోతో తన దర్శకత్వంలో సినిమా ఉంటుందంటూ ప్రకటించిన రాజ్ కందుకూరి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు.