
టాలీవుడ్ ప్రేక్షకులను రౌడీగా అలరిస్తున్న యువ నటుడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాలో సంచలనం సృష్టించిన విజయ్, రౌడీస్ అని ప్రేమగా పిలుస్తూ అభిమానులకు మరింత చేరువయ్యాడు. ఇటీవల విడుదలైన నోటా సినిమాతో నిర్మాతగా మారిన విజయ్, నిర్మాతగా తన తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. అంతేకాదు తన తదుపరి చిత్రంతో ఓ దర్శకుడిని హీరోగా పరిచయం చేయబోతున్నాడు విజయ్.
ఇటీవల తన నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ హిల్ ను ప్రకటించిన విజయ్ దేవరకొండ తొలి ప్రయత్నం నోటా నిర్మాతలతో భాగస్వామిగా చేరాడు. రెండో ప్రయత్నంగా తనకు పెళ్లిచూపులు సినిమాతో హీరోగా బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై విజయ్ దేవరకొండ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.