ఆ వార్తల్లో వాస్తవం లేదు : ‘వెంకీ మామ’ టీం | The News That Venky Mama Has Stopped is Untrue | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 27 2018 1:27 PM | Last Updated on Sat, Oct 27 2018 4:27 PM

The News That Venky Mama Has Stopped is Untrue - Sakshi

విక్టరీ వెంక‌టేష్, యువ సామ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో ఓ సినిమా రానుంద‌ని..ఈ చిత్రానికి టైటిల్ వెంకీ మామ అని తెలిసిన‌ప్పటి నుంచి అటు వెంకీ అభిమానులు ఇటు నాగ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని తెర పై చూస్తామా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శకత్వం వ‌హించ‌నున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

అయితే..ఈ సినిమా పూజా కార్యక్రమాల‌తో ప్రారంభ‌మైంది కానీ...ఇంకా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కాక‌పోవ‌డంతో వెంకీ మామ ఆగిపోయింది అనే ప్రచారం మొద‌లైంది. ఈ విషయంపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు. అస‌లు విష‌యం ఏంటంటే...వెంక‌టేష్ ప్రస్తుతం ఎఫ్ 2 సినిమాలో బిజీగా ఉన్నారు

నాగ‌చైత‌న్య ఓ వైపు స‌వ్యసాచి ప్రమోష‌న్స్, మ‌రో వైపు శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న ‘వెంకీ మామా’ ఇంకా స్టార్ట్ కాలేదు. నవంబర్‌ నెలలోనే ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిపారు. వైవిధ్యమైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమా అక్కినేని, ద‌గ్గుబాటి అభిమానుల‌కు ఓ పండ‌గ అని చెప్పచ్చు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement