ChaySam Divorce: వెంకీ పోస్ట్‌ వైరల్‌..చై-సామ్‌ విడాకుల గురించేనా? | Chaysam Divorce: Venkatesh Daggubati Reacts On Samantha Naga Chaitanya Divorce | Sakshi
Sakshi News home page

ChaySam Divorce: కాస్త బుర్ర వాడాలి.. వెంకీ పోస్ట్‌ వైరల్‌

Published Wed, Oct 6 2021 11:52 AM | Last Updated on Wed, Oct 6 2021 12:21 PM

Chaysam Divorce: Venkatesh Daggubati Reacts On Samantha Naga Chaitanya Divorce - Sakshi

టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ సమంత-నాగ చైతన్యలు విడిపోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా చై-సామ్‌ల విడాకులపైనే చర్చలు జరుగుతున్నాయి.  వాళ్లు ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఎవరు? అంటూ మీడియా, సోషల్‌ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. విడాకుల ఇష్యూపై చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వారిలో కొంతమంది సమంతకు మద్దతు ఇస్తే.. మరికొంతమంది చైతూకి సపోర్ట్‌ చేస్తున్నారు. ఇంకొంత మంది ఇది వారి వ్యక్తిగత విషయమని, దానిపై కామెంట్‌ చేయబోమని చెబుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్‌ సీనియర్‌ హీరో, నాగ చైతన్య మేనమామ విక్టరీ వెంకటేశ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ‘మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు కాస్త బుర్ర కూడా పెట్టాలి అని ఒక పోస్ట్‌ చేశాడు. ఆపై మరొక పోస్ట్‌లో ‘మనసు అనేది ఆలోచన పుట్ట.. మన వెళ్లే మార్గాని జాగ‍్రత్తగా ఎంచుకోవాలి’ అంటూ వెంకీ తన ఇన్‌స్టా స్టోరీలో వరుస పోస్ట్‌లు పెట్టాడు. ఆ కొటేషన్స్‌ చూస్తుంటే చై-సామ్‌ విడాకుల ఇష్యూపై పరోక్షంగా కామెంట్‌ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కొటేషన్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది.  తాజా పరిస్థితులకు అనుగుణంగానే ఆయన ఈ పోస్ట్‌ పెట్టారని అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.
చదవండి:
ఏం జరిగిందో తెలియదు..చైతన్య చాలా కూల్‌: రాజీవ్‌ కనకాల
ఇకపై సమంత ఉండేది అక్కడే.. త్వరలోనే ఆ ఫ్లాట్‌కు మకాం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement