
ఏడాదికి మూడు డిసెంబర్‌లు ఉంటే బాగుండేది
ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ, ‘‘ఇళయరాజా పాటల్లాగా సుతిమెత్తగా హృదయానికి హత్తుకునే సినిమా ఇది. ఎనభైలకు ముందు తెలుగుదనం ఉండే చిత్రాలొచ్చేవి. ఆ తర్వాత అంతా ఫైట్లు, డ్యాన్సులతో వేగం పెరిగిపోయింది. మళ్లీ పాత రోజుల్ని గుర్తుచేసే విధంగా ‘ఉయ్యాలా జంపాలా’ ఉంటుంది. ఇకపై చిన్న సినిమాలను ఇలాగే ఎంకరేజ్ చేయాలని ఉంది’’ అని చెప్పారు.
డి.సురేష్‌బాబు మాట్లాడుతూ - ‘‘ఇందులో నాయికగా చేసిన అవికకు చాలా పాపులార్టీ ఉంది. నెలకు ఏడు రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చిందని తెలిసి, ఇంత చిన్న సినిమాకు ఆమె అవసరమా అనుకున్నాను. కానీ తెరపై ఆమెను చూశాక, రామ్మోహన్ ఎంపిక ఎంత కరెక్టో అర్థమైంది’’ అన్నారు. ఇది కొత్త తరహా సినిమా అని రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విరించివర్మ, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ అవిక కూడా మాట్లాడారు.