కథ వినగానే లవ్‌లో పడ్డాను | i fallen love after listening story | Sakshi
Sakshi News home page

కథ వినగానే లవ్‌లో పడ్డాను

Published Thu, Feb 20 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

కథ వినగానే లవ్‌లో పడ్డాను

కథ వినగానే లవ్‌లో పడ్డాను

 శౌర్య, ‘ఉయ్యాలా జంపాల’ఫేం అవికా గోర్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. నంద్యాల రవి దర్శకుడు. సీనియర్ పాత్రికేయుడు గిరిధర్ నిర్మాత. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి కేఎల్ దామోదరప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. గిరిధర్ మాట్లాడుతూ -‘‘సినీ పాత్రికేయునిగా పాతికేళ్ల కెరీర్ నాది. మంచి కథతో సినిమా నిర్మించాలనే నా ఆశ ఈ సినిమాతో నెరవేరుతోంది. నంద్యాల రవి చక్కని కథ తయారు చేశారు. అవికా కోసం ఆరు నెలలు ఎదురు చూశాం. ఆమె ఓకే చేయడంతో సినిమాకు మరింత గ్లామర్ వచ్చినట్లైంది.
 
  ‘ఇడియట్’ ద్వారా రవితేజకు ఎంత మంచి పేరొచ్చిందో, శౌర్యకు ఈ చిత్రం అంత మంచి పేరు తెస్తుంది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు. ‘‘కమర్షియల్‌గా ఆలోచించకుండా మంచి సినిమా చేయాలనే సంకల్పంతో ఉన్నాం’’ అని సమర్పకుడు తాడిశెట్టి వెంకట్రావ్ అన్నారు. కథకు తగ్గ టీమ్ కుదిరిందని దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. కథ వినగానే... తన పాత్రతో లవ్‌లో పడిపోయానని, ‘ఉయ్యాలా జంపాల’లా తనకు మరో విజయాన్ని ఈ సినిమా ఇస్తుందని అవిక నమ్మకం వ్యక్తం చేశారు. మంచి కథలో హీరోగా నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని శౌర్య చెప్పారు. ఇంకా సయాజీషిండే, భాస్కరభట్ల తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: కేఎమ్ రాధాకృష్ణన్, కెమెరా: సాయిశ్రీరామ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement