ఈసారి తమిళంలో!
బుల్లితెర ‘చిన్నారి పెళ్లికూతురి’గా ఎంట్రీ ఇచ్చి, కథానాయికగా సినిమాల్లో బిజీ అయిపోయారు అవికా గోర్. తెలుగుతో పాటు హిందీ, కన్నడ భాషల్లో కూడా నటించిన ఆమె తాజాగా తమిళంలో ‘కడవుళ్ ఇరుక్కాన్ కుమారు’ అనే చిత్రం అంగీకరించారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోగా రూపొంద నున్న ఈ చిత్రంలో నిక్కీ గల్రానీ మరో కథానాయిక.