Nicky galrani
-
నయన్‌తో స్నేహం కుదిరింది
తమిళసినిమా: ఒక్కోసారి అనుకోకుండా కొన్ని పనులు జరిగిపోతుంటాయి. అవి వారి జీవితంలో నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఇద్దరు బ్యూటీస్ అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు. వనమగన్ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సాయేషాసైగల్. ఇక్కడ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును పొందిన సాయేషా అవకాశాలను బాగానే రాబట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తీ కలిసి నటిస్తున్న కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రంలో నటిస్తోంది. అంతకుముందే తెలుగులో అఖిల్ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. ఇలా దక్షిణాదిలో కేరీర్ ఆశాజనకంగా ఉండటంతో ఇక్కడే మకాం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చిన సాయేషా హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుందట. ఇక్కడ విశేషం ఏమిటంటే అదే ఫ్లాట్‌లో ఇంతకుముందు నటి సమంత నివశించిందట. ఆ ఫ్లాట్‌లో ఉండగా సమంత యమ బిజీగా నటించిందట. దీంతో తాను బిజీ హీరోయిన్ అయిపోతాననే కలలు కంటోందట నటి సాయేషాసైగల్. ఇక నటి నిక్కీగల్రాణి విషయానికి వస్తే కోలీవుడ్‌లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈ అమ్మడు కూడా చెన్నైలో మకాం పెట్టేసింది. స్థానిక ఎగ్మోర్‌లోని ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. అదే అపార్ట్మెంట్లో నిక్కీగల్రాణి ఫ్లాట్‌కు పైన ఫ్లాట్‌లో అగ్రనటి నయనతార చాలా కాలంగా నివశిస్తోంది. ఒకే అపార్ట్మెంట్లో మకాం పెట్టడంతో నయనతార, నిక్కీగల్రాణిలు తరచూ ఎదురు పడటంతో ఆ పరిచయం వారిద్దరి మధ్య స్నేహాన్ని పెంచేసిందట. ఈ విషయాన్ని నటి నిక్కీగల్రాణి పట్టరాని ఆనందంతో తన ట్విట్టర్లో పోస్ట్ చేసేసింది. ఇలా యాదృచ్చికంగానే కొన్ని ఆనందభరిత సంఘటనలు జరుగుతాయన్న మాట. -
విజయానందంలో మరగదనాణియం
తమిళ సినిమా: మరగదనాణియం చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి పోయింది. యాక్సస్ ఫిలింస్ ఫ్యాక్టరీ పతాకంపై ఢిల్లీబాబు నిర్మించిన చిత్రం మరగదనాణియం. ఆది, నిక్కీగల్రాణి జంటగా నటించిన ఈ చిత్రానికి ద్రార సరవణ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆనందరాజ్, ముండాసుపట్టి రామ్‌దాస్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం గత వారంలో తెరపైకి వచ్చి విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చెన్నైలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఇందులో చిత్ర నిర్మాత ఢిల్లీబాబు మాట్లాడుతూ ఉరుమీన్ తరువాత తన సంస్థ నిర్మించిన తాజా చిత్రం మరగదనాణియం అన్నారు. ఒక కమర్షియల్ హీరోగా ఎదుగుతున్న ఆది ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారేమిటన్న భావన తనకు కలిగిందన్నారు. అదే విధంగా నటి నిక్కీగల్రాణి మగగొంతుతో మాట్లాడే పాత్రలో నటించి మెప్పించారన్నారు. ఇది సాధారణ హీరోహీరోయిన్ల ప్రేమ, ఐటమ్ సాంగ్స్‌లతో కూడిన చిత్రం కాదని చిత్ర హీరో ఆది అన్నారు. నిజం చెప్పాలంటే తాను లేకపోయినా ఈ చిత్ర విజయం సాధ్యం అవుతుందేమోగాని, ముండాసుపట్టి రామ్‌దాస్ తదితర పాత్రదారులు లేక పోతే సాధ్యం కాదన్నారు. ఆ పాత్రలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం, యూనిట్ మొత్తం నిజమైన శ్రమనే ఈ చిత్ర విజయానికి కారణంగా ఆది పేర్కొన్నారు. ఈ చిత్రం తెలుగులోనూ విజయవంతంగా సాగుతుండడం విశేషం. -
అహ నా పెళ్లంటలా!
విష్ణు విశాల్, నిక్కీ గల్రానీ జంటగా ఎళిల్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వెల్లైక్కారన్. నిర్మాత పారస్ జైన్ ఈ సినిమాని ‘ప్రేమలీల పెళ్ళి గోల’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. పారస్ జైన్ మాట్లాడుతూ– ‘‘వెల్లైక్కారన్’ రీమేక్ హక్కుల కోసం చాలా మంది పోటీ పడ్డా నా మీద నమ్మకంతో హీరో విష్ణు విశాల్ నాకు ఇచ్చారు. రీమేక్ చేస్తే కామెడీ మిస్ అవుతుందని విశాల్ చెప్పడంతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో జూలై 1న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ప్రేమలీల పెళ్ళి గోల’ చిత్రం చూశాం చాలా బాగుంది. జంధ్యాలగారి ‘ఆహæనా పెళ్లంట, కృష్ణారెడ్డిగారి కామెడీ సినిమాల్లా ఉంది’’ అన్నారు నిర్మాత అచ్చారెడ్డి. ‘‘ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం’’ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. -
అందం మాత్రమే అర్హత కాదు
నటికి అందం మాత్రమే అర్హత కాదంటున్నారు నటి నిక్కీగల్రాణి. డార్లింగ్ చిత్రంలో కోలీవుడ్‌లో ఎంటరై ఆ చిత్రంలో దెయ్యంగా సహజ నటనను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్న నిక్కీగల్రాణి ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమకు డార్లింగ్‌గా మారిపోయారని చెప్పవచ్చు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ నటించిన కో-2 చిత్రం ఈ నెల 13న విడుదలకు ముస్తాబవుతోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎన్నికల వాతావరణంతో వేడెక్కిన సమయంలో విడుదల కానుండడం విశేషంగానే భావించాలి. ఈ చిత్రం గురించి కథానాయకి నిక్కీగల్రాణి తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఒకే తరహా పాత్రల్లో నటించ రాదని నిర్ణయించుకున్న తనకు కో-2 చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అందం ఒక్కటే నటికి అర్హత కాదని మంచి ప్రతిభ, శ్రమ కూడా అవసరం అని పేర్కొన్నారు. కో-2లో అలాంటి వైవిధ్యభరిత పాత్రను పోషించాననీ చెప్పారు. ఇందులో తాను పత్రికా విలేకరిగా నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం నిజ జీవితంలో పత్రికా విలేకరులను చాలా సునిశితంగా పరిశీలించానని చెప్పారు. ముఖ్యంగా వారి వేష భాషలు, ప్రశ్నించే విధానం వంటి అంశాలను దగ్గర నుంచి గమనించాననీ తెలిపారు. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన చిత్ర పాటలు ఎఫ్ఎం రేడియో, ఐ ట్యూన్స్‌లలో వరుసగా ప్రసారం అవుతూ మొదటి స్థానంలో కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. అంతే కాదు చిత్ర విజయంపై నమ్మకం పెరిగిందనీ పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రజల్లో కచ్చితంగా మార్పునకు కారణం అవుతుందన్నారు. ఎన్నికలపై అవగాహన కలిగంచే చిత్రంగా కో-2 ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాబీసింహా, ప్రకాష్‌రాజ్, శరవణన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు కో వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత ఎల్రెడ్ కుమార్ తన ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెర ట్ పతాకంపై నిర్మించారు. శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకు ముస్తాబవుతోంది. -
ఈసారి తమిళంలో!
బుల్లితెర ‘చిన్నారి పెళ్లికూతురి’గా ఎంట్రీ ఇచ్చి, కథానాయికగా సినిమాల్లో బిజీ అయిపోయారు అవికా గోర్. తెలుగుతో పాటు హిందీ, కన్నడ భాషల్లో కూడా నటించిన ఆమె తాజాగా తమిళంలో ‘కడవుళ్ ఇరుక్కాన్ కుమారు’ అనే చిత్రం అంగీకరించారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోగా రూపొంద నున్న ఈ చిత్రంలో నిక్కీ గల్రానీ మరో కథానాయిక. -
గెలుపు కోసం... ఎన్నెన్నో మలుపులు
కొత్త సినిమా గురూ! చిత్రం: ‘మలుపు’ తారాగణం: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ,మిథున్ చక్రవర్తి కెమేరా: షణ్ముఖ సుందరం సంగీతం: ప్రసన్ - ప్రవీణ్ - శ్యామ్ నిర్మాత: రవిరాజా పినిశెట్టి రచన - దర్శకత్వం: సత్యప్రభాస్ పినిశెట్టి కళ జీవితాన్ని అనుకరిస్తుందంటారు! నిజజీవిత కథలు వెండితెర కళగా తెర మీదకు రావడం ఎప్పుడూ ఉన్నదే. కాకపోతే, కొన్ని చిత్రమైన యథార్థ సంఘటనలు సినిమాటిక్‌గా తెరపై పలకరించినప్పుడు, అది నిజజీవిత ఘటనే అని తెలిసినప్పుడు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తాజా ‘మలుపు’ చిత్రం కూడా అలాంటిదే! నిజానికిది చెన్నైలో నలుగురు ఫ్రెండ్స మధ్య జరిగిన కథ. సినిమా కోసం తెలుగులో ఇది విశాఖపట్నంలో జరిగిందన్నట్లు చూపెట్టారు. కథ ప్రకారం హాయిగా, మరో ముగ్గురు స్నేహితులతో కలసి జీవితాన్ని గడిపేసే కుర్రాడు ‘సగా’గా అందరూ పిలుచుకొనే సతీష్ గణపతి (ఆది పిని శెట్టి). అతని ఫ్రెండ్సలో ఒకడు పోలీస్ కమిషనర్ కొడుకు, మరొకడు పార్ల మెంట్ సభ్యుడి కొడుకు. ఈ ఫ్రెండ్స అంతా జీవితంలో మరికొన్నాళ్ళు కలిసి స్టూడెంట్స్ లైఫ్ ఎంజాయ్ చేయడం కోసం డిగ్రీ ఫైనలియర్ ఎగ్జావ్ు్స రాయ కుండా ఎగ్గొడతారు. హీరోకు అమ్మ (ప్రగతి), నాన్న, అక్క ఉంటారు. లాస్య (నిక్కీ గల్రానీ) అనే మోడరన్ ఏజ్ ఫాస్ట్ గర్లను హీరో ప్రేమిస్తాడు. ఆమెను రక్షించే క్రమంలో ఒక గొడవలోనూ ఇరుక్కుంటాడు. ఇంతలో అక్క పెళ్ళి పనులు హీరోకు అప్పగించి, అమ్మానాన్న ఊరెళతారు. తీరా, వాళ్ళటెళ్ళగానే ఆ డిసెంబర్ 31వ తేదీ రాత్రి అనూహ్యమైన ఒక సంఘటన ఎదురవుతుంది. దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అక్కడ నుంచి అతని జీవితమే తలకిందులైపోతుంది. దాంతో ముంబయ్‌లోని నేర సామ్రాజ్యనేత ముదలియార్‌ను వెతుక్కుంటూ అతను బయలుదేరతాడు. ఇంతకీ, ఆ డిసెం బర్ 31 రాత్రి ఏం జరిగిందన్నది ఇంట్రెస్టింగ్ అంశం. దాని చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ రోజేం జరిగింది? దానికీ, ముంబయ్ డాన్కీ లింకేంటి? జీవితంలో కుటుంబమా, స్నేహమా... ఏది ముఖ్యం? ఏదో ఒకటే ఎంచుకో వాల్సిన పరిస్థితి వస్తే ఏమవుతుంది? లాంటి ప్రశ్నలకు జవాబు మిగతా సినిమా. సస్పెన్స డ్రామాను నమ్ముకొన్న ఈ కథలో అవన్నీ తెరపై చూడాలి. ‘పెదరాయుడు’, ‘చంటి’ లాంటి పలు సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మాత అవతారమెత్తి, తెలుగు, తమిళాల్లో నిర్మించిన సినిమా ఇది. ఆయన పెద్ద కొడుకు సత్యప్రభాసే దీనికి దర్శకుడు కూడా! తేజ దర్శకత్వంలో ‘ఒక ‘వి’చిత్రమ్’ ద్వారా తెలుగులో పరిచయమైన హీరో ఆది పినిశెట్టి. ఆ తరువాత తెలుగులో కనిపించింది తక్కువన్న (‘గుండెల్లో గోదారి’) మాటే కానీ, తమిళంలో పేరున్న హీరో. ‘మృగమ్’, ‘ఈరమ్’ లాంటి తమిళ చిత్రాల ద్వారా తనకంటూ పేరు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా ఈ సమ్మర్‌కి రానున్న ‘సరైనోడు’లో విలన్‌గా కనిపించనున్న ఆదికి ఇది ఓ కీలకమైన పాత్ర. తెలుగు వాచికం స్పష్టంగా ఉన్న ఈ చెన్నై కుర్రాడి నటన, డ్యాన్సులు, ఫైట్లు మాస్ మెచ్చేవే. నిక్కీ గల్రానీ పాత్రోచితంగా బాగున్నారు. హిందీ హిట్ ‘ఓ మై గాడ్’కు రీమేక్‌గా ఆ మధ్య తెలుగులో వచ్చిన ‘గోపాల... గోపాల’లో కనిపించిన ప్రసిద్ధ హిందీ నటుడు మిథున్ చక్రవర్తి ఓ కీలకపాత్రధారి. నిజానికి, ఆయన అంగీకరించిన తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రం ఇదే. కాకపోతే, దీని తమిళ వెర్షన్ కన్నా ముందే తెలుగులో ‘గోపాల... గోపాల’ రిలీజైపోయింది. ముంబయ్‌లో సమాంతర ప్రభుత్వం నడిపే నేరసామ్రాజ్య నేత ముదలి యార్గా ఆయన బాగా చేశారు. చూడడానికి కూడా విభిన్నంగా ఉన్నారు. నాజర్, పశుపతి లాంటి సీజన్డ ఆర్టిస్ట్‌ల కంట్రోల్డ్ యాక్షన్ కూడా బాగుంది. రచన, దర్శకత్వ విభాగాల్లో సత్యప్రభాస్ కొత్త తరానికి నచ్చే ట్విస్ట్‌లు, సస్పెన్సను నమ్ముకున్నారు. వర్తమానానికీ, గడచిపోయిన సంఘటనల ఫ్లాష్ బ్యాక్లకూ మధ్య తరచూ అటూ ఇటూ తిరిగే కథాకథన శైలిని బలంగా ఉప యోగించుకున్నారు. ఆసక్తికరంగా ఆరంభమయ్యే ఈ సినిమా కాసేపయ్యాక ఎక్కువగా ప్రేమకథ వైపు మొగ్గుతుంది. ఆ క్రమంలో వేగం తగ్గడం అర్థం చేసుకోవాలి. ఇంటర్వెల్‌కు కాస్తంత ముందు నుంచి కథలో వేగం, అదే ఊపులో ట్విస్టులు పెరుగుతాయి. సినిమా చివరకు వచ్చేసరికి కథ ఎన్నెన్నో ములుపులు తిరుగుతుంది. కొండొకచో అవి పరిమితి మించాయనిపించినా ఉత్కంఠ ఆశించే ప్రేక్షకులు ఫిర్యాదులు చేయరు. నిజానికి, ఎనిమిది నెలల క్రితమే ఈ సినిమా తమిళంలో విడుదలైంది. అక్కడి టైటిల్ - ‘యాగవ రాయినుమ్ నా కాక్క’. ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. చిత్ర నిర్మాత, దర్శ కుడు, హీరో - అందరూ తెలుగు వాళ్ళు కావడంతో ఆలస్యంగానైనా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందించదగ్గ విషయం. ఇలాంటి సినిమాలు తమిళ ప్రేక్షకులకు కొత్త కాకపోయినా, తెలుగు వారికి కొత్తగా అనిపించడం, ఇటీవలి రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండడం బాక్సాఫీస్ వద్ద గెలుపు విషయంలో ‘మలుపు’కు కలిసొచ్చే అంశాలు. - రెంటాల జయదేవ