అహ నా పెళ్లంటలా!
విష్ణు విశాల్, నిక్కీ గల్రానీ జంటగా ఎళిల్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వెల్లైక్కారన్. నిర్మాత పారస్ జైన్ ఈ సినిమాని ‘ప్రేమలీల పెళ్ళి గోల’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. పారస్ జైన్ మాట్లాడుతూ– ‘‘వెల్లైక్కారన్’ రీమేక్ హక్కుల కోసం చాలా మంది పోటీ పడ్డా నా మీద నమ్మకంతో హీరో విష్ణు విశాల్ నాకు ఇచ్చారు.
రీమేక్ చేస్తే కామెడీ మిస్ అవుతుందని విశాల్ చెప్పడంతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో జూలై 1న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ప్రేమలీల పెళ్ళి గోల’ చిత్రం చూశాం చాలా బాగుంది. జంధ్యాలగారి ‘ఆహæనా పెళ్లంట, కృష్ణారెడ్డిగారి కామెడీ సినిమాల్లా ఉంది’’ అన్నారు నిర్మాత అచ్చారెడ్డి. ‘‘ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం’’ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.