
కోలీవుడ్‌లో కథానాయకుడిగా, నిర్మాతగా తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంసాదించుకున్నాడు హీరో విష్ణువిశాల్. ఈయన ఇంతకు ముందు కథానాయకుడిగా నటించిన రాక్షసన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు రామ్‌కుమార్.. విష్ణువిశాల్‌తో మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. ఇది విష్ణువిశాల్ నటిస్తున్న 21వ చిత్రం అవుతుంది. ఇటీవలే షూటింగ్ మొదలవగా.. హీరోయిన్ ఎవరన్నది వెల్లడించలేదు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం మలయాళ నటి మమితా బైజు నటించనున్నట్లు ఆమె ఫొటో వైరలవుతోంది. ఆల్‌రెడీ ఆమె షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఈమె ఇటీవల వచ్చిన మలయాళ చిత్రం ప్రేమలుతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇప్పటికే ఆమె కోలీవుడ్‌లో జీవీ.ప్రకాశ్‌కుమార్ సరసన రెబల్ చిత్రంలో నటించింది. ఈమె నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. ఇది ఈ నెల 15వ తేదీన తెరపైకి రానుంది.
తాజాగా ఇప్పుడు విష్ణువిశాల్ సరసన నటించే అవకాశం ఈ భామను వరించిందన్న మాట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్‌కుమార్.. రాక్షసన్ చిత్రానికి భిన్నంగా ప్రేమతో కూడిన ఫాంటసీ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
చదవండి: ధనుష్ మా కుమారుడే అంటూ పిటిషన్.. తీర్పు ఇచ్చిన కోర్టు
Comments
Please login to add a commentAdd a comment