విష్ణువిశాల్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా..? | - | Sakshi
Sakshi News home page

విష్ణువిశాల్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా..?

Published Thu, Mar 7 2024 5:20 AM | Last Updated on Thu, Mar 7 2024 6:05 AM

- - Sakshi

తమిళసినిమా: ఒక్కొక్కసారి కొన్ని చిత్రాల్లో ముందుగా అనుకున్న నటీనటులు ఆ తరువాత మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నటుడు శింబు విషయం లోనూ ఇదే జరిగిందని సమాచారం. వెందు తనిందదు కాడు చిత్రం తరువాత వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మాత ఐసరి గణేశ్‌ శింబు హీరోగా కరోనా కుమార్‌ పేరుతో చిత్రం చేయ తలపెట్టారు. దీనికి గోకుల్‌ దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల నటుడు శింబు ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు సమాచారం. దీంతో చాలాకాలంగా ఈ చిత్రం సెట్స్‌పైకి రాలేదు. కాగా తాజాగా కరోనా కుమార్‌ చిత్రం మరోసారి వార్తల్లోకెక్కింది. దీనికి కారణం ఇందులో నటుడు శింబు పోషించాల్సిన పాత్రకు నటుడు విష్ణువిశాల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌ అతిథి పాత్రలో నటించిన లాల్‌ సలామ్‌ చిత్రంలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా నటించిన విష్ణువిశాల్‌ ప్రస్తుతం తను సొంతంగా నిర్మిస్తున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. కాగా తాజాగా కరోనా కుమార్‌ చిత్రానికి కమిట్‌ కావడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఇందులో ఆయనకు జంటగా నటి అదితి శంకర్‌ నటించబోతున్నట్లు సమాచారం. ఈమె ఇప్పుటికే చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో ఆకాశ్‌ మురళికి జంటగా నటిస్తున్నారు. దీని తరువాత సూర్య సరసన నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. సూర్య లేని సన్నివేశాలను దర్శకురాలు చిత్రీకరిస్తున్నారు. కాగా ఇందులో నటి అదితి శంకర్‌ నాయకిగా నటిస్తున్న విషయాన్ని చిత్ర వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే కరోనా కుమార్‌ చిత్రంలో ఈమె నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement