అందం మాత్రమే అర్హత కాదు | want to talent not only buety :nicky galrani | Sakshi
Sakshi News home page

అందం మాత్రమే అర్హత కాదు

Published Thu, May 5 2016 5:52 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

అందం మాత్రమే  అర్హత కాదు

అందం మాత్రమే అర్హత కాదు

నటికి అందం మాత్రమే అర్హత కాదంటున్నారు నటి నిక్కీగల్రాణి. డార్లింగ్ చిత్రంలో కోలీవుడ్‌లో ఎంటరై ఆ చిత్రంలో దెయ్యంగా సహజ నటనను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్న నిక్కీగల్రాణి ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమకు డార్లింగ్‌గా మారిపోయారని చెప్పవచ్చు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ నటించిన కో-2 చిత్రం ఈ నెల 13న విడుదలకు ముస్తాబవుతోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎన్నికల వాతావరణంతో వేడెక్కిన సమయంలో విడుదల కానుండడం విశేషంగానే భావించాలి.

ఈ చిత్రం గురించి కథానాయకి నిక్కీగల్రాణి తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఒకే తరహా పాత్రల్లో నటించ రాదని నిర్ణయించుకున్న తనకు కో-2 చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అందం ఒక్కటే నటికి అర్హత కాదని మంచి ప్రతిభ, శ్రమ కూడా అవసరం అని పేర్కొన్నారు. కో-2లో అలాంటి వైవిధ్యభరిత పాత్రను పోషించాననీ చెప్పారు. ఇందులో తాను పత్రికా విలేకరిగా నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం నిజ జీవితంలో పత్రికా విలేకరులను చాలా సునిశితంగా పరిశీలించానని చెప్పారు. ముఖ్యంగా వారి వేష భాషలు, ప్రశ్నించే విధానం వంటి అంశాలను దగ్గర నుంచి గమనించాననీ తెలిపారు.

ఇప్పటికే మార్కెట్‌లోకి విడుదలైన చిత్ర పాటలు ఎఫ్‌ఎం రేడియో, ఐ ట్యూన్స్‌లలో వరుసగా ప్రసారం అవుతూ మొదటి స్థానంలో కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. అంతే కాదు చిత్ర విజయంపై నమ్మకం పెరిగిందనీ పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రజల్లో కచ్చితంగా మార్పునకు కారణం అవుతుందన్నారు. ఎన్నికలపై అవగాహన కలిగంచే చిత్రంగా కో-2 ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాబీసింహా, ప్రకాష్‌రాజ్, శరవణన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు కో వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత ఎల్‌రెడ్ కుమార్ తన ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెర ట్ పతాకంపై నిర్మించారు. శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకు ముస్తాబవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement