అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రధారులుగా కెమెరామేన్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు, పి. రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రం టీజర్ ఈ నెల 26న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘సిలకా.. సిలకా.. రామా సిలకా.. ఏదో ఉందే మెలికా..’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ఇండియన్ ఐడల్ రేవంత్ పాడారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.
ఈ సందర్భంగా ‘గరుడ వేగ’ అంజి మాట్లాడుతూ – ‘‘ప్రధాన తారాగణంతో పాటు 150 మంది జూనియర్ ఆర్టిస్టులు, 30 మంది డ్యాన్సర్స్‌పై ఈ పాటను తెరకెక్కించాం. ఈ పాటలో ఇద్దరు ముంబై డ్యాన్సర్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘రోజ్ విల్లా, ‘ముగ్గురు మొనగాళ్లు’ తర్వాత మేం చేస్తోన్న మూడో చిత్రం ఇది. టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు అచ్యుత రామారావు.
Comments
Please login to add a commentAdd a comment