
‘బాలికా వధు’ అనగానే గుర్తొచ్చే పేరు అవికా గోర్. ఆ టీవీ సీరియల్ ఆమెను అంత పాపులర్ చేసింది. స్క్రిప్ట్ మీదే తప్ప ఫ్యాషన్ గురించి అంతగా పట్టదు ఆమెకు. తెర మీద తన పాత్రను చూసుకోవడమే కానీ అద్దంలో తన ప్రతిబింబం చూసుకోవాలనే మోజు లేదు. అలాంటి అవికాను ఫ్యాషనబుల్‌గా చూపించాలనే సవాలును తీసుకున్న బ్రాండ్ ఇదే..
హౌస్ ఆఫ్ పింక్
ఆధునిక మహిళ అభిరుచి, అవసరాలను గమనించి వాటికనుగుణమైన డిజైనర్ వేర్‌ను రూపొందించేందుకు ఏర్పడిన బ్రాండే ‘హౌస్ ఆఫ్ పింక్’. స్టయిల్ అండ్ సౌకర్యమే ప్రత్యేకతగా దశాబ్దానికి పైగా కొనసాగుతోందీ ఫ్యాషన్ హౌస్. కేవలం కాటన్, చందేరీ ఫాబ్రిక్‌నే ఉపయోగిస్తుందీ బ్రాండ్.
సంప్రదాయ కుట్టు కళే దీని ప్రధాన డిజైన్. అందుకే దేశం నలుమూలలో ఉన్న హస్తకళా కళాకారుల నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ తన బ్రాండ్ వాల్యూను పెంచుకుంటోంది హౌస్ ఆఫ్ పింక్.
డ్రెస్
గోల్డ్ జరీ బూటా, చేతులకు జర్దోసీ వర్క్‌తో డిజైన్ చేసిన ఈ గ్రీన్ కలర్ చందేరీ లాంగ్ కుర్తాకు జతగా ప్లెయిన్ పలాజో ప్యాంట్, సిల్క్ దుపట్టా కూడా రావడంతో సింప్లీ గ్రాండ్ లుక్‌తో అవికాను మెరిపిస్తోంది.
డ్రెస్ బ్రాండ్: హౌస్ ఆఫ్ పింక్
ధర: రూ. 18,500
అదే మన అందాన్ని పెంచుతుంది!
‘ఎలా కనిపిస్తున్నాను అనేదాని మీద నేనెప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. ఆ మాటకొస్తే అందంగా కనిపించడమనేదాన్ని ఇష్టపడను. శ్రద్ధాసక్తులతో మనం చేసిన పనే మన సౌందర్యాన్ని పెంచుతుంది. అదే మనల్ని బయటి ప్రపంచానికి అందంగా చూపిస్తుందని నమ్ముతాను. నిజానికి నేను ప్రేక్షకుల నుంచి అందుకున్నది కూడా అదే. వాళ్లెప్పుడూ నా నటననే ప్రశంసించారు కానీ నా గ్లామర్ లుక్స్‌ను కాదు. సో.. నా పనే నా ఫ్యాషన్.. గ్లామర్.. ఫ్యాషన్.. అన్నీ!’ – అవికా గోర్
-దీపిక కొండి
చదవండి: Fashion- Mouni Roy: ‘డెమె బై గాబ్రియేలా’.. మౌనీ రాయ్ కట్టుకున్న ఈ చీర ధరెంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment