అతడు స్నేహితుడు మాత్రమే, బిడ్డను కనలేదు: అవికా గోర్‌ | Viral: Avika Gor Shocking Reaction On Secret Child Rumours With Manish | Sakshi
Sakshi News home page

నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?: అవికా గోర్‌

Jun 22 2021 10:43 AM | Updated on Jun 22 2021 2:37 PM

Viral: Avika Gor Shocking Reaction On Secret Child Rumours With Manish - Sakshi

అవికా గోర్‌

ఏం చెప్పను? అతడు మా నాన్న కంటే కొంచెం చిన్నవాడు. సరిగ్గా చెప్పాలంటే మా నాన్న వయసు. మా ఇద్దరి మధ్య సంబంధం ఉందని..

అవికా గోర్‌.. సినిమాల్లోకి రాకముందే ఆమె అందరికీ తెలుసు. 'బాలికా వధు'గా హిందీ ప్రేక్షకులకు, 'చిన్నారి పెళ్లికూతురు'గా తెలుగు వీక్షకులకు ఆమె సుపరిచితురాలు. తర్వాత ఆమె 'ససురాల్‌ సిమర్‌ కా' అనే మరో సీరియల్‌లోనూ నటించింది. అందులో నటుడు మనీశ్‌ రాయ్‌సింఘన్‌తో కలిసి పని చేసింది. అయితే ఈ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని, వీళ్లు సీక్రెట్‌గా ఓ బిడ్డను కూడా కన్నారని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి.

తాజాగా దీనిపై స్పందించిన అవికా.. అందుకు ఆస్కారమే లేదని కుండ బద్ధలు కొట్టేసింది. 'మేం ఓ బిడ్డను కన్నామని, ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచామని అంటున్నారు. అది పూర్తిగా అవాస్తవం. 13 ఏళ్ల వయసులో నటిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి మనీశ్‌ నాకు స్నేహితుడు. అతడికి నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. అతడి నుంచి చాలా నేర్చుకున్నాను. మా మధ్య ఏదైనా జరిగిందేమోనని ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు'

'కానీ ఏం చెప్పను? అతడు మా నాన్న కంటే కొంచెం చిన్నవాడు. సరిగ్గా చెప్పాలంటే మా నాన్న వయసు. ఇక మా ఇద్దరి మధ్య సంబంధం ఉందని వచ్చిన కథనాలు మొదట్లో మా మీద ప్రభావాన్ని చూపించాయి. రెండు వారాలపాటు మేమిద్దరం మాట్లాడుకోలేదు కూడా! కానీ మళ్లీ అలాంటి పుకార్లు వస్తూనే ఉంటడంతో అసలు దూరంగా ఉండటంలో అర్థం లేదనిపించింది. ఇద్దరం క్లోజ్‌ ఫ్రెండ్స్‌లా కలిసిపోయాం. మా గురించి రాసిన గాసిప్‌ వార్తలు చదివి ఇప్పటికీ సరదాగా నవ్వుకుంటున్నాం' అని అవికా గోర్‌ చెప్పుకొచ్చింది.

చదవండి: పెళ్లికి సిద్దం, అతడు ఎప్పుడంటే అప్పుడే: అవికా గోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement