
పండక్కి నాలుగైదు సినిమాలు ఒకేసారి విడుదలైనా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను ఆశించవచ్చు. పండగ సెలవులు, ఫెస్టివల్ మూడ్ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయి. అందుకే పండగకి మూడు నుంచి నాలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. ఈసారి దసరా రేస్‌లో నిలబడే సినిమాల లిస్ట్ ఒక్కోటిగా బయటికి వస్తోంది. ‘చాణక్య’గా వస్తున్నారు గోపీచంద్. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహరీన్, జరీన్‌ఖాన్ కథానాయికలుగా నటించారు. టాకీ పార్ట్ పూర్తయింది. ఇటీవలే ఇటలీలో పాటల చిత్రీకరణ జరిగింది. ఈ సినిమాకు అజయ్ సుంకర సహనిర్మాత. దసరా పండక్కి ప్రేక్షకులను నవ్వించడంతో పాటు భయపెట్టనున్నారు దర్శకుడు ఓంకార్. ఆల్రెడీ ఆయన ‘రాజుగారి గది, రాజుగారి గది 2’ చిత్రాలతో అదే చేశారు.
ఈ సారి అంతకుమించి నవ్వించి భయపెట్టడానికి ‘రాజుగారి గది 3’ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. అశ్విన్‌బాబు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా ఓక్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఇక దసరా రేస్‌కి ఓ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కూడా రెడీ అవుతోంది. కీర్తీ సురేశ్ నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘మిస్ ఇండియా’ కూడా దసరాకే విడుదల అంటున్నారు. ‘వెంకీ మామ’ కూడా దసరాకు విడుదలవుతుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. మరి.. దసరా రేస్‌లో నిలిచే చిత్రాలు ఏవో తెలియాలంటే ఓపిక పట్టాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment