నా ఆశలపై నీళ్లు చల్లారు!: నటి | Actress Avika Gor is not working in any movie | Sakshi
Sakshi News home page

నాకు సినిమాలు రాకుండా చేశారు!: నటి

Published Sat, Sep 16 2017 12:57 PM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM

నా ఆశలపై నీళ్లు చల్లారు!: నటి

నా ఆశలపై నీళ్లు చల్లారు!: నటి

కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో నటి అవికా గోర్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారని  ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ వదంతులు ఆనోటా ఈనోటా పాకి చివరికి అవిక చెవినపడ్డట్లున్నాయి. ఈ విషయంపై ఆమె చాలా తీవ్రంగానే స్పందించారు. తాను సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నట్లు ఎక్కడా, ఎప్పుడూ ప్రకటించలేదన్నారు. ఇంకా చెప్పాలంటే.. రెండు సినిమాలు సక్సెస్ కావడంతో కొందరు సీనియర్ సినీ సెలబ్రిటీలు తన చేతిలో సినిమాలు లేకుండా చేశారని ఆమె ప్రధాన ఆరోపణ. అవికాకు చాన్స్‌లు ఇవ్వొద్దని తమకు తెలిసిన డైరెక్టర్లకు సీనియర్లు సూచించడం ఓ కారణంగా కనిపిస్తోంది.

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీలతో తనకంటూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవడం కొందరికి నచ్చకపోవడం వల్లే అవకాశాలు ఆమె అవకాశాలు కోల్పోయారట. ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాతో మరో హిట్ అందుకున్న ఈ భామ ఆ తరువాత ఒక్క తెలుగు సినిమాకు కూడా సైన్ చేయలేదు. ఓ దశలో ఆమె సినీ కెరీర్‌ను ముగిస్తారని వదంతులు రావడంపై ఆమె ఆందోళన చెందారు. చివరికి టాలీవుడ్‌ను వదిలిపెట్టినా.. బాలీవుడ్‌లోనైనా అవకాశాలు ఇవ్వకపోతారా అని అక్కడికే వెళ్లనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement