
నిఖిల్ తో జతకట్టనున్న అవికా గోర్
చెన్నై: 'ఉయ్యాల జంపాల'తో హీరోయిన్ గా మారిన 'చిన్నారి పెళ్లికూతురు' అవికా గోర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యువహీరో నిఖిల్ తో ఆమె జత కట్టనుంది. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కించే సినిమాలో వీరు కలిసి నటించనున్నారు. మరో హీరోయిన్ గా తాప్సీ ఎంపికైంది.
ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, మరో హీరోయిన్ ను ఖరారు చేయాల్సివుందని దర్శకుడు ఆనంద్ తెలిపారు. ఫాంటసీ ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో నిఖిల్ నటిస్తాడని వెల్లడించారు. వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో ప్రారంభంకానుంది. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చనున్నాడు. తాను తెలుగులో దర్శకత్వం వహించిన 'టైగర్' సినిమాను తమిళంలో రీమేక్ చేయాలనుకుంటున్నట్టు ఆనంద్ తెలిపారు.