Hero Sriram Talk About 10th Class Diaries Movie - Sakshi
Sakshi News home page

10th Class Diaries: ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ స్కూల్ డేస్‌ని గుర్తు చేస్తుంది : శ్రీరామ్‌

Published Tue, Jun 14 2022 5:29 PM | Last Updated on Tue, Jun 14 2022 5:49 PM

Hero Sriram talk About 10th Class Diaries Movie - Sakshi

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' లాంటి సినిమాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌ చేశా. కానీ ఇప్పుడు అటువంటి రోల్స్‌ వస్తే రిజెక్ట్‌ చేస్తున్నా. నాకు క్లోజ్‌ అయినవాళ్లు అడిగితే మాత్రం చేస్తా. నాకు తెలుగులో వరసగా సినిమాలు చేయాలని ఉంది. మంచి కథలు వస్తే ఇక్కడే సినిమాలు చేస్తా. లేదంటే తమిళంలో చేసుకుంటా. అక్కడ నా చేతిలో ఇప్పుడు ఆరు సినిమాలు ఉన్నాయి’అని హీరో శ్రీరామ్‌ అన్నారు.

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...     


ఆయన టెన్త్ బ్యాచ్ రీ యూనియన్  కథే ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’
సినిమాటోగ్రాఫర్ అంజితో నాకు పరిచయం ఉంది. తమిళంలో నాతో ఒక ప్రాజెక్ట్ చేయాల్సింది. అప్పుడు నా డేట్స్ కుదరలేదు. సినిమా చేయలేదు. అప్పుడు అంజితో ‘ర్శకుడిగా చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ నా దగ్గరకు తీసుకు రావాలి'అని చెప్పాను. ఒక కథ ఉందని చెబితే... హైదరాబాద్ వచ్చి కలిశా. ఫర్ ఎ చేంజ్... దర్శకుడు కథ చెప్పలేదు. నిర్మాత అచ్యుత రామారావు గారు కథ చెప్పారు. ఆ తర్వాత తెలిసింది... ఆయనే కథ రాశారని! కథ విన్న వెంటనే 'మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా?' అని అడిగా. అప్పుడు రామారావు ఎమోషనల్ అయ్యారు. మా బ్యాచ్ లో జరిగిందని చెప్పారు. ఆయన టెన్త్ బ్యాచ్ రీ యూనియన్ తర్వాత జరిగిన సంఘటనలే ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్'. అయితే, కొంత ఫిక్షన్ ఉంది. సినిమాలో క్యారెక్టర్లు ఎవరో ఒకరు రిలేట్ చేసుకునేలా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్ డేస్ మెమొరబుల్ మూమెంట్స్. అటువంటి మూమెంట్స్ ను పిక్చరైజ్ చేశాం. 

రియాలీటీగా తీశాం 
మూవీ బేసిక్ కంటెంట్... రీ యూనియన్. హరిశ్చంద్రుడు అయినా, రాముడు అయినా ఇంకొకరి జీవితంలో విలన్ అనుకోవచ్చు. ఏదో ఒక తప్పు జరిగి ఉంటుంది. మన జీవితంలో కరెక్టుగా ఉన్నా ఇంకొకరి జీవితంలో చెడ్డోళ్లు అవుతాం. తెలిసో తెలియకో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అటువంటి ఒక తప్పు వల్ల ఎంత మంది జీవితం ఎలా మారుతుందనేదే ఈ మూవీ కాన్సెప్ట్‌ . రియాలిటీగా తీశాం. ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా చూసుకున్నాం. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా ఎంటర్టైనింగ్ రోల్స్ కావడంతో ఈజీ అయ్యింది. ఒక మనిషి అఘోర అయ్యారు. ఆయన రీ యూనియన్ కి అలాగే వచ్చారు.

అన్ని చూపించాం
రీ యూనియన్స్ లో చాలా మంది స్నేహితులు కలుస్తారు. అయితే,  అందరూ తమ ప్రయివేట్ లైఫ్ షేర్ చేసుకోరు. బావున్నానని చెబుతారు. క్లోజ్ అయిన వాళ్ళ దగ్గర మాత్రమే ఓపెన్ అవుతారు. మా సినిమాలో అన్నీ చూపించాం. అయితే, కొంత లైటర్ వీన్ లో చూపించాం.చాందిని పాత్రలో అవికా గోర్ నటించారు. చాందిని కోసం అన్వేషించడమే సినిమా. ఎప్పుడు కలుస్తామో మీరు ఊహించుకోవచ్చు. 


'ఒకరికి ఒకరు'తర్వాత సంతృప్తి ఇచ్చిన చిత్రమిది
సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయితే కమర్షియల్ సినిమా తీయాలి. ఆరు నుంచి అరవై ఏళ్ల వ్యక్తి దాకా అందరూ చూసే సినిమా చేయమని వాళ్ళను కోరుతున్నా. కామెడీ, ఎమోషన్, ఫీలింగ్స్... అన్నీ ఉండాలి. అంజి నైస్ ఎంటర్టైనింగ్ కమర్షియల్ సినిమాతో వచ్చారు. ఇదొక ఫీల్ గుడ్ ఫిల్మ్. ఇందులో లవ్, ఫ్రెండ్షిప్, హ్యూమర్... అన్నీ ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్స్ కూడా! 'టెన్త్ క్లాస్ డైరీస్' అనేది పర్ఫెక్ట్ ప్యాకేజీ ఉన్న కమర్షియల్ సినిమా. 'ఒకరికి ఒకరు' తర్వాత నాకు సంతృప్తి ఇచ్చిన చిత్రమిది.తెలుగులో అంజితో మరో సినిమా డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. రసూల్‌ కూడా ఓ స్క్రిప్ట్‌ రెడీ చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement