10th Class Diaries Movie
-
ఈమె తెలుగు హిట్ సినిమా హీరోయిన్.. ఇప్పుడేమో గుర్తుపట్టలేనంతగా!
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వెళ్లేటోళ్లు వెళ్లిపోతూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు హిట్ మూవీస్ చేసినా సరే కనుమరుగైపోతుంటారు. ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి పరిస్థితే. అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం టాలీవుడ్ హిట్ మూవీలో హీరోయిన్గా చేసింది. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మరి ఎవరో గుర్తొచ్చిందా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు శరణ్య నాగ్. అరె.. ఈ పేరు ఎక్కడా విన్నట్లు లేదే? ఏ సినిమాలో చేసిందబ్బా అని ఆలోచిస్తున్నారా? కంగారూ పడకండి. 2006లో '10th క్లాస్' అని ఓ సినిమా రిలీజైంది. అందులో హీరోయిన్గా చేసింది ఈమెనే. చెన్నైలో పుట్టి పెరిగిన శరణ్య.. 1998లోనే చైల్డ్ ఆర్టిస్టుగా 'కాదల్ కవితై', 'నీ వరువాయ్ ఎన్న' సినిమాల్లో నటించింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి హిట్ సినిమా 'భ్రమయుగం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) 2003 నుంచి పూర్తిస్థాయి నటిగా మారింది. ఆ ఏడాదే తెలుగులో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' అనే ద్విభాషా చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌గా యాక్ట్ చేసింది. 'ప్రేమిస్తే' సినిమాలోనూ నటించింది. 2006లో రిలీజైన '10th క్లాస్' చిత్రంతో హీరోయిన్ అయిపోయింది. ఇది హిట్ అయినా సరే ఇక్కడ పెద్దగా అవకాశాలేం రాలేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత 'ప్రేమ ఒక మైకం' అనే తెలుగు సినిమాలో ఓ సహాయ పాత్ర చేసింది. 2014 తర్వాత నుంచి పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైపోయిన శరణ్య.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లని అలరిస్తోంది. అయితే అప్పట్లో టీనేజ్ బ్యూటీలా ఉన్నప్పుడు చూసి, మళ్లీ ఇప్పుడు చూసేసరికి చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ఆమె ఈమెనా అని తెలిసి అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్) View this post on Instagram A post shared by Sharanya Nagh (@sharanya_nagh) -
ఆ చిత్రాలు డైరెక్టర్‌గా నాకు మంచి గుర్తింపు ఇచ్చాయి: ‘గరుడవేగా’ అంజి
దాదాపు 50 చిత్రాలకు పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసి సినీ పరిశ్రమలో డీఓపీ(DOP) అంజిగా ఫేమస్ అయ్యారు అంజి. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తూనే తనలోని మరో టాలెంట్‌ని బయటపెడుతూ దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అయ్యారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా 10th క్లాస్ డైరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ఓటీటీ వేదికపై ట్రెండ్ అవుతోంది. ఆడియన్స్ ఇస్తున్న సూపర్ రెస్పాన్స్‌తో భారీ వ్యూస్ రాబడుతోంది. ఇదే జోష్‌లో బుజ్జి ఇలా రా అనే మరో సినిమాకు దర్శకత్వంలో వహించి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుంచారు అంజి. సునీల్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో బుజ్జి ఇలా రా సినిమాను తెరకెక్కింది. ఈ సినిమాను ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ పతాకంపై రూప జగదీష్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో గరుడవేగా అంజి (DOP అంజి) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్బంగా నిర్వహించిన మూవీ సక్సెస్ మీట్లో డైరెక్టర్ అంజి మాట్లాడుతూ.. ముందుగా ఈ సినిమాని ఇంతలా ఆదరించిన తెలుగు ఆడియన్స్ అందరికి ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ చిత్ర కథ అనుకున్నప్పుడు ఆడియన్‌కి ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి థ్రిల్లింగ్ ఎలెమెంట్స్తో ట్విస్టులతో ముందుకి వెళ్ళేలా రాసుకున్నాం. అలాంటి కథని తమ నటనతో ఇంకా బాగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా నటించిన సునీల్, ధనరాజ్ లకు నా ప్రత్యేక ధన్యవాదాలు. హీరోయిన్ గా నటించిన చాందిని తమిళ్ రసన్ తనదైన శైలిలో అద్బుతమైన నటనని కనబర్చింది. అలాగే శ్రీకాంత్ అయ్యింగార్, రాజా రవీంద్ర, పోసాని కృష్ణమురళి తదితర నటీనటులు వాళ్ళ వాళ్ళ పాత్రలకి పూర్తి న్యాయం చేసి సినిమాని ఇంకో మెట్టు ఎక్కించారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించిన సాయి కార్తీక్, ఎడిటర్ చోటా .కే .ప్రసాద్ గారు మెయిన్ అసెట్ అయ్యారు’ అని అంజి చెప్పుకొచ్చారు. -
అమెజాన్‌లో దూసుకుపోతున్న ‘టెన్త్ క్లాస్ డైరీస్’
శ్రీరామ్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా ఇటీవల నటించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై అచ్యుత రామారావు. పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గత నెల జూలై 1వ విడుదలైన మంచి విజయం సాధించింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఇటివలె ఓటీటీకి వచ్చిన ఈ సినిమా అక్కడ సైతం ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటోంది. చదవండి: ఆ ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన ట్వీట్ ప్రస్తుతం ఆమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికీ మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో అవికా గోర్ శ్రీరామ్ కెమిస్ట్రీ, లవ్ స్టోరీకి అందరూ కనెక్ట్ అయ్యారు. ఇక శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజల కామెడీ టైమింగ్‌తో సినిమా ఆసాంతం వినోదభరితంగా సాగింది. కాగా ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమైన సంగతి తెలిసిందే. సురేష్ బొబ్బలి ఈ సినిమాకు పాటలు అందించారు. -
స్కూల్ డేస్‌ను గుర్తు చేసే 'టెన్త్ క్లాస్ డైరీస్' రివ్యూ
టైటిల్: టెన్త్ క్లాస్ డైరీస్ నటీనటులు: శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాస్ రెడ్డి, అచ్యుత రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, నాజర్ తదితరులు దర్శకత్వం, సినిమాటోగ్రఫీ: 'గరుడవేగ' అంజి నిర్మాతలు: అచ్యుత రామారావు, రవితేజ మన్యం, రవి కొల్లిపార సంగీతం: సురేష్ బొబ్బిలి విడుదల తేది: జులై 1, 2022 అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు. పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి అజయ్ మైసూర్ సమర్పకులు. ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అయ్యారు. 'టెన్త్ క్లాస్ డైరీస్' చిత్రం శుక్రవారం (జులై 1) ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ: మిడిల్ క్లాస్ అబ్బాయి సోమయాజ్ (శ్రీరామ్) బాగా చదువుకుని అమెరికాలో బిజినెస్ మ్యాన్‌గా స్థిరపడతాడు. డబ్బు, అమ్మాయిలు, లగ్జరీతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ తన జీవితంలో ఏదో చిన్న అంసతృప్తి. ఈ వెలితీతో జీవిస్తున్న అతనికి ఆనందం లేదు. అతని భార్య కూడా వదిలేస్తుంది. తను ఏది మిస్ అవుతున్నాడో తెలుసుకునేందుకు ఒక సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తాడు. ఈ క్రమంలోనే అతని ఆనందం టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ప్రేమించిన తన ఫస్ట్ లవ్ చాందినీ (అవికా గోర్) దగ్గర ఉందని. దీంతో టెన్త్ క్లాస్ రీ యూనియన్‌కు ప్లాన్ చేస్తాడు. మరీ ఆ రీ యూనియన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయింది ? చాందినీని కలుసుకున్నాడా ? అసలు చాందినీకి ఏమైంది ? అనే తదితర విషయాలను తెలుసుకోవాలంటే కచ్చితంగా ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్'కు వెళ్లాల్సిందే. విశ్లేషణ: యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు మనసులు హత్తుకునేలా ఉంటాయి. కానీ అలాంటి కథలతో వచ్చే సినిమాలు కాస్తా అటు ఇటు అయిన తేడా కొడుతుంటాయి. అలాంటిదే ఈ కథ. నిర్మాత అచ్యుతరామారావు జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమ కారణంగా ఒక అమ్మాయి జీవితం ఎలా మారిందనే అంశంతో ఈ కథను రూపొందించారు. ప్రేమికుడి నిర్లక్ష్యం, తండ్రి అతి ప్రేమ ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేశాయో ఈ సినిమా ద్వారా చూపించారు. నిజానికి ఇలాంటి ఒక మంచి కథను ఎంచుకున్నందుకు దర్శకనిర్మాతలను మెచ్చుకోవాల్సిందే. కానీ వారు ఎంచుకున్న కథను పక్కాగా వెండితెరపై ఆవిష్కరించలేకపోయారు. ప్రేమించిన అమ్మాయి కోసం వెతికేందుకు చేసిన రీ యూనియన్, దానిలో భాగంగా వచ్చే సీన్లు ఇంతకుముందు వచ్చిన కొన్ని సినిమాలను గుర్తు చేస్తాయి. హాఫ్ బాయిల్ (శ్రీనివాస్ రెడ్డి), గౌరవ్ నిర్మాత (అచ్యుత రామారావు) మధ్య వచ్చే సీన్లు మాత్రం చాలా ఆకట్టుకుంటాయి. వీరిద్దరి నటనతో ప్రేక్షకులను తెగ నవ్వించారు. కానీ సోమయాజ్, చాందినీ ప్రేమ సన్నివేశాలు కొంచెం రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. ఈ లవ్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. అయితే సెకండాఫ్‌లో హీరోయిన్ కోసం వెతికే ట్రాక్ బాగుంటుంది. ఓవైపు నవ్విస్తూనే అమ్మాయిల జీవితంలో కోరుకునే విషయాలు, వారు ఎదుర్కొనే సమస్యలను బాగా చూపించారు. ఊహించని విధంగా ఉండే క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలిస్తుంది. మూవీ మొత్తం ఎలా ఉన్న క్లైమాక్స్‌కు వచ్చేసరికి మాత్రం ఆడియెన్స్‌కు ఒక మంచి సినిమా చూశామనే అనుభూతిని కలిగిస్తుంది. ఎవరెలా చేశారంటే? తన ఫస్ట్ లవ్‌ను దక్కించుకోవాలనే ప్రేమికుడిగా, ఆనందం మిస్ అయిన బిజినెస్ మ్యాన్‌గా శ్రీరామ్ పర్వాలేదనిపించాడు. అయితే ఇంతకుముందు 'రోజాపూలు' సినిమాలో చూసిన శ్రీరామ్ నటన, ఆ ఈజ్ ఎక్కడో మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఇక అవికా గోర్ నటన కూడా పర్వాలేదనిపించింది. ఆమె పాత్ర నిడివి కాస్త తక్కువగా ఉంది. హీరో ఫ్రెండ్స్‌గా చేసిన శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత అచ్యుత రామారావు కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. వీరి కాంబినేషన్లో వచ్చే సీన్లు నవ్వు తెప్పిస్తాయి. కమెడియన్‌గా అచ్యుత రామారావుకు మంచి భవిష్యత్తు ఉందనే చెప్పవచ్చు. వీరితోపాటు హిమజ, అర్చన, శివ బాలాజీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నాజర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక సినిమాలోని బీజీఎం '96' మూవీని తలపిస్తుంది. ఇక 'గరుడవేగ' అంజికి ఇది మొదటి సినిమా కావడంతో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. కానీ సినిమాను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. రీ యూనియన్ సీన్లు ఇంకొంచెం బాగా రాసుకోవాల్సింది. సినిమాలోని డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఆలోచింపజేసేలా ఉంటాయి. మొత్తంగా ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్' మీ స్కూల్ డేస్ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. చాలవరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పవచ్చు. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
ఆమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది: డైరెక్టర్
Director Garudavega Anji About 10th Class Diaries Movie: ‘‘టెన్త్ క్లాస్ డైరీస్’లో ఎమోషన్, యాక్షన్, డ్రామా అన్నీ ఉన్నాయి. మా నిర్మాత అచ్యుత రామారావు, ఆయన స్నేహితుల జీవితంలో జరిగిన కథ ఇది. ఆయన కథ చెప్పాక స్క్రీన్ ప్లే రాసి సినిమాటిక్‌గా తీశాం’’ అని దర్శకుడు ‘గరుడ వేగ’ అంజి తెలిపారు. అవికా గోర్, శ్రీరామ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ‘గరుడవేగ’ అంజి మాట్లాడుతూ.. ‘‘మా స్నేహితుల్లో ఒక అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కోసం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది’ అని అచ్యుత రామారావుగారు చెప్పారు. ఆ పాయింట్ నాలో స్ఫూర్తి నింపడంతో దర్శకత్వం వైపు వచ్చాను. ఛాయాగ్రాహకుడిగా నాకు 50వ చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకుల దగ్గర నేను నేర్చుకున్నది, నేను పని చేసిన 40మంది దర్శకుల అనుభవం దర్శకుడిగా నాకు ‘టెన్త్ క్లాస్ డైరీస్’కి ఉపయోగపడింది. డైరెక్టర్‌గా నా రెండో చిత్రం ‘బుజ్జి ఇలా రా’ రిలీజ్‌కు రెడీగా ఉంది. కెమెరామెన్‌గా ఒక మలయాళ సినిమా కమిట్ అయ్యాను’’ అని పేర్కొన్నారు. చదవండి: మరోసారి తండ్రి అయిన నిర్మాత దిల్ రాజు.. ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ ప్రముఖులు.. అమితాబ్ ఆసక్తికర పోస్ట్ తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ.. -
ఇకపై అటువంటి రోల్స్ చేయను: హీరో శ్రీరామ్
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశా. కానీ ఇప్పుడు అటువంటి రోల్స్ వస్తే రిజెక్ట్ చేస్తున్నా. నాకు క్లోజ్ అయినవాళ్లు అడిగితే మాత్రం చేస్తా. నాకు తెలుగులో వరసగా సినిమాలు చేయాలని ఉంది. మంచి కథలు వస్తే ఇక్కడే సినిమాలు చేస్తా. లేదంటే తమిళంలో చేసుకుంటా. అక్కడ నా చేతిలో ఇప్పుడు ఆరు సినిమాలు ఉన్నాయి’అని హీరో శ్రీరామ్ అన్నారు. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు... ఆయన టెన్త్ బ్యాచ్ రీ యూనియన్ కథే ‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమాటోగ్రాఫర్ అంజితో నాకు పరిచయం ఉంది. తమిళంలో నాతో ఒక ప్రాజెక్ట్ చేయాల్సింది. అప్పుడు నా డేట్స్ కుదరలేదు. సినిమా చేయలేదు. అప్పుడు అంజితో ‘ర్శకుడిగా చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ నా దగ్గరకు తీసుకు రావాలి'అని చెప్పాను. ఒక కథ ఉందని చెబితే... హైదరాబాద్ వచ్చి కలిశా. ఫర్ ఎ చేంజ్... దర్శకుడు కథ చెప్పలేదు. నిర్మాత అచ్యుత రామారావు గారు కథ చెప్పారు. ఆ తర్వాత తెలిసింది... ఆయనే కథ రాశారని! కథ విన్న వెంటనే 'మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా?' అని అడిగా. అప్పుడు రామారావు ఎమోషనల్ అయ్యారు. మా బ్యాచ్ లో జరిగిందని చెప్పారు. ఆయన టెన్త్ బ్యాచ్ రీ యూనియన్ తర్వాత జరిగిన సంఘటనలే ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్'. అయితే, కొంత ఫిక్షన్ ఉంది. సినిమాలో క్యారెక్టర్లు ఎవరో ఒకరు రిలేట్ చేసుకునేలా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్ డేస్ మెమొరబుల్ మూమెంట్స్. అటువంటి మూమెంట్స్ ను పిక్చరైజ్ చేశాం. రియాలీటీగా తీశాం మూవీ బేసిక్ కంటెంట్... రీ యూనియన్. హరిశ్చంద్రుడు అయినా, రాముడు అయినా ఇంకొకరి జీవితంలో విలన్ అనుకోవచ్చు. ఏదో ఒక తప్పు జరిగి ఉంటుంది. మన జీవితంలో కరెక్టుగా ఉన్నా ఇంకొకరి జీవితంలో చెడ్డోళ్లు అవుతాం. తెలిసో తెలియకో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అటువంటి ఒక తప్పు వల్ల ఎంత మంది జీవితం ఎలా మారుతుందనేదే ఈ మూవీ కాన్సెప్ట్ . రియాలిటీగా తీశాం. ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా చూసుకున్నాం. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా ఎంటర్టైనింగ్ రోల్స్ కావడంతో ఈజీ అయ్యింది. ఒక మనిషి అఘోర అయ్యారు. ఆయన రీ యూనియన్ కి అలాగే వచ్చారు. అన్ని చూపించాం రీ యూనియన్స్ లో చాలా మంది స్నేహితులు కలుస్తారు. అయితే, అందరూ తమ ప్రయివేట్ లైఫ్ షేర్ చేసుకోరు. బావున్నానని చెబుతారు. క్లోజ్ అయిన వాళ్ళ దగ్గర మాత్రమే ఓపెన్ అవుతారు. మా సినిమాలో అన్నీ చూపించాం. అయితే, కొంత లైటర్ వీన్ లో చూపించాం.చాందిని పాత్రలో అవికా గోర్ నటించారు. చాందిని కోసం అన్వేషించడమే సినిమా. ఎప్పుడు కలుస్తామో మీరు ఊహించుకోవచ్చు. 'ఒకరికి ఒకరు'తర్వాత సంతృప్తి ఇచ్చిన చిత్రమిది సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయితే కమర్షియల్ సినిమా తీయాలి. ఆరు నుంచి అరవై ఏళ్ల వ్యక్తి దాకా అందరూ చూసే సినిమా చేయమని వాళ్ళను కోరుతున్నా. కామెడీ, ఎమోషన్, ఫీలింగ్స్... అన్నీ ఉండాలి. అంజి నైస్ ఎంటర్టైనింగ్ కమర్షియల్ సినిమాతో వచ్చారు. ఇదొక ఫీల్ గుడ్ ఫిల్మ్. ఇందులో లవ్, ఫ్రెండ్షిప్, హ్యూమర్... అన్నీ ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్స్ కూడా! 'టెన్త్ క్లాస్ డైరీస్' అనేది పర్ఫెక్ట్ ప్యాకేజీ ఉన్న కమర్షియల్ సినిమా. 'ఒకరికి ఒకరు' తర్వాత నాకు సంతృప్తి ఇచ్చిన చిత్రమిది.తెలుగులో అంజితో మరో సినిమా డిస్కషన్స్ జరుగుతున్నాయి. రసూల్ కూడా ఓ స్క్రిప్ట్ రెడీ చేశాడు.