శ్రీరామ్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా ఇటీవల నటించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై అచ్యుత రామారావు. పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గత నెల జూలై 1వ విడుదలైన మంచి విజయం సాధించింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఇటివలె ఓటీటీకి వచ్చిన ఈ సినిమా అక్కడ సైతం ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటోంది.
చదవండి: ఆ ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన ట్వీట్
ప్రస్తుతం ఆమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికీ మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో అవికా గోర్ శ్రీరామ్ కెమిస్ట్రీ, లవ్ స్టోరీకి అందరూ కనెక్ట్ అయ్యారు. ఇక శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజల కామెడీ టైమింగ్‌తో సినిమా ఆసాంతం వినోదభరితంగా సాగింది. కాగా ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమైన సంగతి తెలిసిందే. సురేష్ బొబ్బలి ఈ సినిమాకు పాటలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment