ఈమె తెలుగు హిట్ సినిమా హీరోయిన్.. ఇప్పుడేమో గుర్తుపట్టలేనంతగా! | 10th Class Movie Actress Saranya Nagh Latest Pics And Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హిట్ మూవీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Mar 6 2024 2:13 PM | Updated on Mar 6 2024 2:58 PM

10th Class Movie Actress Sharanya Nagh Latest Pics And Details - Sakshi

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వెళ్లేటోళ్లు వెళ్లిపోతూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు హిట్ మూవీస్ చేసినా సరే కనుమరుగైపోతుంటారు. ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి పరిస్థితే. అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం టాలీవుడ్ హిట్ మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మరి ఎవరో గుర్తొచ్చిందా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు శరణ్య నాగ్. అరె.. ఈ పేరు ఎక్కడా విన్నట్లు లేదే? ఏ సినిమాలో చేసిందబ్బా అని ఆలోచిస్తున్నారా? కంగారూ పడకండి. 2006లో '10th క్లాస్' అని ఓ సినిమా రిలీజైంది. అందులో హీరోయిన్‌గా చేసింది ఈమెనే. చెన్నైలో పుట్టి పెరిగిన శరణ్య.. 1998లోనే చైల్డ్ ఆర్టిస్టుగా 'కాదల్ కవితై', 'నీ వరువాయ్ ఎన్న' సినిమాల్లో నటించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి హిట్ సినిమా 'భ్రమయుగం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

2003 నుంచి పూర్తిస్థాయి నటిగా మారింది. ఆ ఏడాదే తెలుగులో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' అనే ద్విభాషా చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌గా యాక్ట్ చేసింది. 'ప్రేమిస్తే' సినిమాలోనూ నటించింది. 2006లో రిలీజైన '10th క్లాస్' చిత్రంతో హీరోయిన్ అయిపోయింది. ఇది హిట్ అయినా సరే ఇక్కడ పెద్దగా అవకాశాలేం రాలేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత 'ప్రేమ ఒక మైకం' అనే తెలుగు సినిమాలో ఓ సహాయ పాత్ర చేసింది. 2014 తర్వాత నుంచి పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.

ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైపోయిన శరణ్య.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లని అలరిస్తోంది. అయితే అప్పట్లో టీనేజ్ బ్యూటీలా ఉన్నప్పుడు చూసి, మళ్లీ ఇప్పుడు చూసేసరికి చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ఆమె ఈమెనా అని తెలిసి అవాక్కవుతున్నారు.

(ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement