యాక్టింగ్ మానేస్తానంటున్న హీరోయిన్ | Avika gor To Stop Acting | Sakshi
Sakshi News home page

యాక్టింగ్ మానేస్తానంటున్న హీరోయిన్

Published Sun, Apr 3 2016 12:49 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

యాక్టింగ్ మానేస్తానంటున్న హీరోయిన్

యాక్టింగ్ మానేస్తానంటున్న హీరోయిన్

వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలో ఏ హీరోయిన్ అయినా, మిగతావి పక్కన పెట్టి సినిమాల మీదే దృష్టిపెడుతుంది. కానీ యంగ్ హీరోయిన్ అవికాగోర్ మాత్రం, యాక్టింగ్కు కామా పెట్టాలని భావిస్తుందట. ఇప్పటికే తెలుగులో నాలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటి రెండు విజయాలు సాధించింది. టెలివిజన్ సీరియల్ చిన్నారి పెళ్లికూతురుతో అందరికి దగ్గరయ్యిన ఈ అమ్మడిని వరస అవకాశాలు పలకరిస్తున్నాయి.

ఇలా కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలో యాక్టింగ్ మానేస్తున్నానంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది అవికా. ప్రస్తుతానికి చదువు మీద దృష్టిపెట్టాలనే ఆలోచనతో కొంతకాలం నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. అయితే యాక్టింగ్ పూర్తిగా మానేయటం లేదని, చదువు పూర్తయిన తరువాత తిరిగి ఇదే రంగంలో అడుగుపెడతానంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు తన తరువాత చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో నటించిన ప్రత్యూష బెనర్జీ మృతిపై కూడా స్పందించింది అవికా. తన చనిపోయిందన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానన్న అవికా, గతంలో ఎప్పుడు తను బాధపడటం చూడలేదని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement