Prathyusha benarjee
-
కూతురి శ్రద్ధాంజలి.. ఓ తండ్రి ఆవేదన
ముంబై: బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) సీరియల్లో ఆనందిగా మెప్పించిన నటి ప్రత్యూష బెనర్జీ మరణించి నాలుగు ఏళ్లు అవుతుంది. 2016 ఏప్రిల్1న ముంబైలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె శ్రద్ధాంజలి సందర్భంగా ఆమె చిత్రాపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాలనుకున్న తండ్రికి లాక్డౌన్ కారణంగా నిరాశే ఎదురైంది. రోజంతా తిరిగినా తనకు పూలదండ దొరకలేదని ప్రత్యూష బెనర్జి తండ్రి శంకర్ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ సంవత్సరం తన కూతురి శ్రద్ధాంజలికి పూలమాల వేసి నివాళులు అర్పించేవాడినని, ఈసారి లాక్డౌన్ సందర్భంగా పరిస్థితులు మారాయని ఓ మీడియాతో మాట్లాడుతూ విచారం వ్యక్తం చేశారు. చివరికి తనే కొన్ని పువ్వులను తీసుకొని పూలదండ సిద్ధం చేసి ప్రత్యూషకు నివాళులు అర్పించినట్లు చెప్పుకొచ్చారు. బాలికా వధు సీరియల్లో ప్రత్యూషకు భర్తగా నటించిన సహనటుడు శశాంక్ వ్యాస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నాడు. “మనం ఇష్టపడే వాళ్లు భౌతికంగా దూరమైనా ఎప్పుడూ మన పక్కనే ఉంటారు. కనిపించకపోయినా మనల్ని గమనిస్తూ ఎప్పుడూ మనపై ప్రేమను కురిపిస్తారు” అంటూ రాశాడు. -
యాక్టింగ్ మానేస్తానంటున్న హీరోయిన్
వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలో ఏ హీరోయిన్ అయినా, మిగతావి పక్కన పెట్టి సినిమాల మీదే దృష్టిపెడుతుంది. కానీ యంగ్ హీరోయిన్ అవికాగోర్ మాత్రం, యాక్టింగ్‌కు కామా పెట్టాలని భావిస్తుందట. ఇప్పటికే తెలుగులో నాలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటి రెండు విజయాలు సాధించింది. టెలివిజన్ సీరియల్ చిన్నారి పెళ్లికూతురుతో అందరికి దగ్గరయ్యిన ఈ అమ్మడిని వరస అవకాశాలు పలకరిస్తున్నాయి. ఇలా కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలో యాక్టింగ్ మానేస్తున్నానంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది అవికా. ప్రస్తుతానికి చదువు మీద దృష్టిపెట్టాలనే ఆలోచనతో కొంతకాలం నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. అయితే యాక్టింగ్ పూర్తిగా మానేయటం లేదని, చదువు పూర్తయిన తరువాత తిరిగి ఇదే రంగంలో అడుగుపెడతానంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తన తరువాత చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో నటించిన ప్రత్యూష బెనర్జీ మృతిపై కూడా స్పందించింది అవికా. తన చనిపోయిందన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానన్న అవికా, గతంలో ఎప్పుడు తను బాధపడటం చూడలేదని తెలిపింది.