'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో చైల్డ్ అర్టిస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది నటి అవికా గోర్. తెలుగులో 'ఉయ్యాల జంపాల' మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' వంటి వరుస సినిమాల్లో నటించిన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆ తర్వాత సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన అవికా ఆ తర్వాత బాలీవుడ్‌కు మాకాం మార్చింది.
ఈ క్రమంలో అక్కడ ప్రైవేటు సాంగ్స్, అల్భమ్స్‌తో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో నాగచైతన్య, రాశిఖన్నాల థ్యాంక్యూ చిత్రంతో తిరిగి తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇటీవల నెట్ సినిమాతో ఫ్యాన్స్‌ను పలకరించింది. ఇక ఇప్పుడు ఆమె ‘బ్రో’ అనే కొత్త సినిమాతో రాబోతోంది.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ హైదరాబాద్‌లో జరగగా ఈ కార్యక్రమంలో అవికా సందడి చేసింది. ఈ సందర్భంగా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. బ్రో చిత్రంలో నటుడు నవీన్ చంద్రకు చెల్లెలిగా నటించింది అవికా.
ఇదిలా ఉంటే అవికా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో కొంతకాలంగా ప్రేమయాణం సాగిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అవికా తన ప్రేమ, పెళ్లిపై స్పందిస్తూ.. హైదరాబాద్‌కు చెందిన మిలింద్ చంద్వానీతో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు చెప్పింది. త్వరలోనే అతడితో ఏడడుగులు కూడా వేయబోతున్నట్లు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment