ఇద్దరమ్మాయిలతో జీవీ రొమాన్స్ | GV to romance Avika Gor and Nikki Galrani in Rajesh's film | Sakshi
Sakshi News home page

ఇద్దరమ్మాయిలతో జీవీ రొమాన్స్

Published Sat, Feb 20 2016 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

ఇద్దరమ్మాయిలతో జీవీ రొమాన్స్

ఇద్దరమ్మాయిలతో జీవీ రొమాన్స్

మళ్లీ ఇద్దరమ్మాయిలతో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు జీవీ.ప్రకాశ్‌కుమార్. ఇంతకు ముందు మనీషాయాదవ్, ఆనందిలతో ఈయన డ్యూయెట్లు పాడిన త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం కమర్షియల్‌గా హిట్ అయి కాసుల వర్షం కురిపించిదన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇటు హీరోగానూ,అటు సంగీతదర్శకుడిగానూ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న జీవీ తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు.కడవుళ్ ఉరుకిరాన్ కుమారు చిత్రంలో నటించి సంగీతం అందించడానికి రెడీ అవుతున్నారు.ఇంతకు ముందు శివ మనసుల శక్తి, ఒరుకల్ ఒరుకన్నాడీ, బాస్‌ఎన్గిర భాస్కరన్, వాసువుమ్,శరవణనుమ్ ఒన్నా పడిచవంగ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన ఎం.రాజేశ్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ఇది.

దైవవాక్కు, చిన్నమాప్లే, రాసయ్య, అరవిందన్ విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అమ్మా క్రియేషన్స్ శివ చిన్న గ్యాప్ తరువాత నిర్మించనున్న చిత్రం కడవుళ్ ఇరుక్కిరాన్ కుమారు. ఇందులో జీవీ ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్నారు. అందులో ఒకరు నిక్కీగల్రాణి కాగా ఇంకో బ్యూటీ అవిక గోర్. ఈ గుజరాతి చిన్నది చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ ద్వారా మంచి ప్రాచుర్యం పొందింది. అంతే కాదు తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసి అక్కడి అక్కడి అభిమానుల మనసుల్ని దోచుకుంది.

తాజాగా కేర్ ఆఫ్ ఫుట్‌పాత్ అనే కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్న అవికగోర్ ఇప్పుడు జీవీతో కలిసి తమిళ చిత్రపరిశ్రమకు దిగుమతి కానుందన్న మాట. లవ్, రొమాంటిక్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో అందే వేసిన దర్శకుడు రాజేశ్ ఈ చిత్రాన్ని ఆ తరహాలోనే జనరంజకంగా తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారట. మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని విశాఖపట్టణం.గోవా  ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement