Aadi Sai Kumar, Avika Gor Starts Shooting For Amaran City Chapter 1 Movie - Sakshi
Sakshi News home page

Amaran In The city chapter 1: పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ఆది

Published Fri, Jul 16 2021 4:26 PM | Last Updated on Fri, Jul 16 2021 5:02 PM

Aadi Sai Kumar Amaran In The city chapter 1 Movie Shooting Starts - Sakshi

ఆది సాయి కుమార్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’. ఎస్‌.బల‌వీర్‌ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్‌వీఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ నాయికగా నటిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రాని కొత్త కథా నేపథ్యంతో 'అమరన్‌’రూపొందుతుంది. ఈ మూవీ షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఈ ఫస్ట్‌ షెడ్యూల్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ సెట్‌లో షూటింగ్‌ చేస్తున్నారు.  దీంతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. ఆది సాయి కుమార్ సరికొత్త లుక్ లో కనిపించనున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉండబోతోంది. సాయి కుమార్, ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర శంకర్, అయన్, శృతి, రోషన్, మధు మణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement