
మాధవ్ , బీవీఎస్ రవి, మిమో, సాషా, తమ్మారెడ్డి భరద్వాజ్
‘‘నేనెక్కడున్నా’ మూవీ ట్రైలర్ అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ మూవీలో అందరూ గొప్పగా నటించారు. మా నాన్న మిథున్ చక్రవర్తిగారిలా నేను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాగమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అని మిమో చక్రవర్తి అన్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, సాషా చెత్రి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘నేనెక్కడున్నా’(Nenekkadunna). మాధవ్ కోదాడ దర్శకత్వంలో కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గంగాధర్, గోపీనాథ్ రెడ్డితోపాటు పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘మిథున్ చక్రవర్తిలా మిమో చక్రవర్తి కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘పత్రికా రంగంలోని వ్యక్తికి ఎలాంటి సమస్యలు వస్తాయి? ఆ సమస్యలను వారు ఎదుర్కోవడం అవసరమా? అనే ప్రశ్నకు జవాబు ఈ సినిమా’’ అని గోపీనాథ్ రెడ్డి చె΄్పారు. ‘‘మహిళల గొప్పతనం చాటి చెప్పేలా జర్నలిజం నేపథ్యంలో ఈ సినిమా చేశాం’’ అని చె΄్పారు మాధవ్ కోదాడ.
Comments
Please login to add a commentAdd a comment