
టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్‌లో మరణించారు. అయితే, ఆయన మరణానికి కారణాలు తెలియడం లేదు. తెలుగులో 'గం గం.. గణేశా' మూవీని కేదార్ నిర్మించారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం గతేడాదిలో విడుదలైంది. అయితే, కేదార్ సెలగంశెట్టి మరణ వార్తను తెలుసుకున్న ఆయన మిత్రులు సంతాపం తెలుపుతున్నారు. కేదార్ సెలగంశెట్టికి ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. అల్లు అర్జున్, నిర్మాత బన్నీవాస్, విజయ్ దేవరకొండలకు ఆయన అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.
కేదార్ సెలగంశెట్టిని నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది అల్లు అర్జున్ అని తెలిసిందే. ఇప్పటికే చాలామంది స్నేహితులను ఇండస్ట్రీకి అల్లు అర్జున్ పరిచయం చేశారు. ఈ క్రమంలో కేదార్‌ను కూడా బన్నీనే సపోర్ట్ చేశారు. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించాలని కేదార్ సెలగంశెట్టి ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో సుకుమార్- విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఒక మూవీని కూడా వారు ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆయన హఠాత్తుగా మరణించారని వార్త తెలియడంతో ఇండస్ట్రీలోని ఆయన స్నేహితులు కూడా షాక్ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment