‘‘ఇండస్ట్రీలో మనమంతా బతికేది చిన్న చిత్రాల వల్లే. అవి బాగుంటేనే మనం బాగుంటాం. మా ‘డ్రింకర్ సాయి’ నచ్చితే పది మందికి చెప్పండి.. నచ్చకుంటే వంద మందికి చెప్పండి’’ అని డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి అన్నారు.
ధర్మ, ఐశ్వర్యా శర్మ జంటగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఇస్మాయిల్ మాట్లాడుతూ– ‘‘డ్రింకర్ సాయి’లో అన్ని భావోద్వేగాలున్నాయి’’ అన్నారు. ‘‘ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన్ని కలవగా.. ‘డ్రింకర్ సాయి’ సక్సెస్ కావాలని కోరడం సంతోషాన్నిచ్చింది’’ అని ధర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment