aishwarya sharma
-
‘డ్రింకర్ సాయి’ మూవీ రివ్యూ
టైటిల్: డ్రింకర్ సాయి (బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్)నటీనటులు: ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, స్ఎస్ కాంచి, కిర్రాక్ సీత, రీతు చౌదరి,తదితరులునిర్మాణ సంస్థలు: ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్రచన, దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టిసంగీతం: శ్రీవసంత్లిరిక్స్: చంద్రబోస్ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్విడుదల తేది: డిసెంబర్ 27, 2024ఈ మధ్యకాలంలో ట్రైలర్‌తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బూతు డైలాగ్స్‌తో పాటు మంచి ఎమోషన్‌తో కూడా ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేలా చేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘డ్రింకర్ సాయి’పై బజ్ క్రియేట్ అయింది. ఈ ఏడాది చివరిలో(డిసెంబర్ 27) వచ్చిన ఈ చిన్న చిత్రం ఎలా ఉంది? ‘డ్రింకర్ సాయి’దెబ్బకు టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మత్తు ఎక్కిందా లేదా? రివ్యూలో చూద్దాంకథేంటంటే.. సాయి అలియాస్ డ్రింకర్ సాయి(ధర్మ) బాగా ధనవంతుడు. పెరెంట్స్ చనిపోవడంతో తాగుడుకు బానిసవుతాడు. నిత్యం తాగుతూ అందరితో గొడవలు పడడం..అరెస్ట్ అయితే అతని అంకుల్(శ్రీకాంత్ అయ్యంగార్) బెయిల్‌పై విడిపించడం..ఇదే తంతుగా మారుతుంది. ఓసారి బాగా తాగిఉన్న సాయిని మెడికల్ స్టూడెంట్ బాగీ(ఐశ్వర్య శర్మ) తన బైక్‌తో ఢీకొట్టి పారిపోతుంది. ఆ మరుసటి రోజు తనకు యాక్సిడెంట్ చేసింది బాగీనే అని తెలుసుకుంటాడు. అమెతో గొడవపడేందుకు వెళ్లి.. ప్రేమలో పడిపోతాడు. బాగీకి మాత్రం సాయి అంటే అసలు ఇష్టం ఉండదు. ఈ విషయం సాయికి చెబితే ఎక్కడ గొడవ చేస్తాడోనని ప్రేమించినట్లు నటిస్తుంది. బాగీ ప్రేమను పొందేందుకు సాయి చేసిన ప్రయత్నాలు ఏంటి? బాగీ తనను ప్రేమించట్లేదని తెలిసిన తర్వాత సాయి ఏం చేశాడు? తనకు ఉన్న తాగుడు అలవాటు ఎక్కడకు దారి తీసింది? చివరకు సాయి బాగీ ప్రేమను పొందాడా లేదా? అనేదే మితగా కథ. ఎలా ఉందంటే.. హీరో తాగుతూ జులాయిగా తిరగడం.. ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడడం..ఓ మంచి పని చేసి చివరకు ఆమె ప్రేమ పొందడం..ఇలాంటి ప్రేమ కథలు తెలుగు తెరపై చాలా వచ్చాయి. డ్రింకర్ సాయి కూడా అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన లవ్‌స్టోరీనే. తాగుడుకు బానిసైన హీరో.. తనలాంటి వాడిని చూస్తేనే చిరాకు పడే హీరోయిన్ని ఎలా ప్రేమలో పడేశాడనేది ఈ సినిమా కథ. చివరిలో ఓ సోషల్ మెసేజ్ ఇవ్వడం ఈ ప్రేమకథను ప్లస్ పాయింట్. అయితే ట్రైలర్ చూస్తే మాత్రం ఇదొక బోల్డ్ మూవీ, అసభ్యకర సన్నివేశాలు చాలానే ఉంటాయని అనుకుంటారు. కానీ తెరపై సినిమా చూస్తే మాత్రం అలాంటి ఫీలింగ్ కలగదు. ఒకటి రెండు చోట్ల అలాంటి డైలాగ్స్ ఉన్నా..ఇప్పుడు వస్తున్న సినిమాలతో పోలిస్తే తక్కువే అనిపిస్తాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, చివరిలో ఇచ్చిన మెసేజ్ బాగుంది. కానీ ఆ పాయింట్ చెప్పడానికి అల్లుకున్న కథ, రాసుకున్న స్క్రీన్‌ప్లే అంతగా ఆకట్టుకోలేదు. హీరో హీరోయిన్ వెంబడి పడడం.. ఆమె ఛీకొట్టడం.. చివరి వరకు ఇదే ఉంటుంది. లవ్‌స్టోరీలో కూడా కొత్తదనం ఉండదు. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు చాలా ఫన్‌గా సాగుతుంది. అయితే వంతెన (భద్రం) పాత్ర వచ్చిన ప్రతిసారి కామెడీ పండకపోగా.. సాఫీగా సాగుతున్న లవ్‌స్టోరీకి ఇరికించినట్లుగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో వచ్చే పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సీన్ రొటీన్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్ ఎక్కువ భాగం వంతెన ఆశ్రమంలో కథనం సాగుతుంది. ఓ పిల్లోడితో చేయించే కామెడీ ఇరికించినట్లుగా ఉంటుంది. చివరి అరగంట ఎమోషనల్ సాగుతుంది. టెక్నికల్‌గా బాగున్నప్పటికీ.. కథ, కథనం మాత్రం దర్శకుడు ఆకట్టుకునే విధంగా రాసుకోలేకపోయాడు. చివరిలో ఇచ్చిన సందేశం బాగుంటుంది. కథ, కథనం మరింత బలంగా రాసుకొని ఉంటే డ్రింకర్ సాయి బాక్సాఫీస్‌ని ఊగించేవాడు. ఎవరెలా చేశారంటే.. ధర్మకి ఇది రెండో సినిమా. అంతకు ముందు సింధూరం అనే సినిమాలో నటించాడు. కానీ అంతగా గుర్తింపు రాలేదు. అయితే డ్రింకర్ సాయిలో మాత్రం రెచ్చిపోయి నటించాడు. రెండో సినిమానే అయినా.. కెమెరా ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఐశ్వర్య శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమాకే మంచి పాత్ర లభించింది. బాగీ పాత్రలో ఆమె జీవించేసింది. వంతెనగా భద్రం నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. శ్రీకాంత్ అయ్యంగార్, కిర్రాక్ సీత, రీతూ చౌదరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రీవసంత్ సంగీతం సినిమా స్థాయి పెంచేసింది. పాటలు బాగున్నాయి. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీ సీన్ తెరపై రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
చిన్న సినిమా బాగుంటేనే మనం బాగుంటాం – కిరణ్ తిరుమల శెట్టి
‘‘ఇండస్ట్రీలో మనమంతా బతికేది చిన్న చిత్రాల వల్లే. అవి బాగుంటేనే మనం బాగుంటాం. మా ‘డ్రింకర్ సాయి’ నచ్చితే పది మందికి చెప్పండి.. నచ్చకుంటే వంద మందికి చెప్పండి’’ అని డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి అన్నారు. ధర్మ, ఐశ్వర్యా శర్మ జంటగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఇస్మాయిల్ మాట్లాడుతూ– ‘‘డ్రింకర్ సాయి’లో అన్ని భావోద్వేగాలున్నాయి’’ అన్నారు. ‘‘ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన్ని కలవగా.. ‘డ్రింకర్ సాయి’ సక్సెస్ కావాలని కోరడం సంతోషాన్నిచ్చింది’’ అని ధర్మ తెలిపారు. -
‘డ్రింకర్ సాయి’ యూత్‌ను చెడగొట్టడు: హీరో ధర్మ
నేను ఇండస్ట్రీలోకి రావడం మా నాన్నకు ఇష్టం లేదు. ఆయన వద్దన్నా నేను సినిమాల్లోకి వచ్చేశా. డ్రికంర్ సాయి సినిమా పూర్తయిన తర్వాత నాన్నకు చూపించాను. ఫస్ట్ టైం మా నాన్న నన్ను మెచ్చుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో కచ్చితంగా సక్సెస్ అవుతావని ఆశ్వీరదించాడు. డ్రింకర్ సాయి మూవీ యూత్‌ని చెడగొట్టే సినిమా కాదు. ప్రతి ఒక్కరు మెచ్చుకునే చిత్రం. సినిమా చూశాక ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకుంటారు. క్లైమాక్స్ హార్ట్ టచ్ చేస్తుంది’ అన్నారు యంగ్ హీరో ధర్మ. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ధర్మ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...→ మాది గుంటూరులోని హనుమాన్ జంక్షన్. చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఆసక్తి ఉండేది. చిరంజీవి(chiranjeevi) గారి పాటలకు డ్యాన్స్ లు చేసేవాడిని. స్కూల్ లో ఉన్నప్పుడు నాటకాల్లో నటించాను. అలా క్రమంగా సినిమాల మీద ఇష్టం పెరిగింది. మా తాతగారు ఎగ్జిబిటర్. హనుమాన్ జంక్షన్ లో థియేటర్ ఉండేది. మా నాన్న కాకాణి బాబు సుహాసని, శోభన్ బాబు జంటగా పుణ్యదంపతులు సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా చేశారు. మాకు కొన్ని థియేటర్స్ ఉన్నాయి. కొన్ని రోజులు ఆ థియేటర్స్ లో వర్క్ చేశా. రోజూ సినిమాలు చూస్తుండేవాడిని. నన్ను నేను తెరపై ఎప్పుడు చూసుకుందామా అని అనిపించేది. ఇంజినీరింగ్ చదివాక నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశా. లాభాలు చూశాను. ఆ తర్వాత సత్యానంద్ గారి ఇనిస్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాను. నా అభిమాన నటుడు ప్రభాస్. ఆయన నటన చూస్తే ఎంతో నాచురల్ గా ఉంటుంది. డ్యాన్సుల్లో చిరంజీవి గారి గ్రేస్ మరే హీరోకు రాదనేది నా అభిప్రాయం.→ నేను సింధూరం అనే సినిమాలో నటించాను. నేను ఒప్పుకున్న ఫస్ట్ మూవీ డ్రింకర్ సాయి(drinker sai movie)నే. అయితే ఫస్ట్ రిలీజ్ అయ్యింది సింధూరం. ఇది నా రెండో మూవీ అయ్యింది. ఈ కథ విన్నప్పుడు ఎగ్జైట్ అయ్యాను. వాస్తవంగా ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కథ ఇది. నేను వెళ్లి ఆ వ్యక్తిని కలిశాను. అతని లైఫ్ లో జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాను. అయితే మా మూవీలో వాస్తవ ఘటనలకు కొంత ఫిక్షన్ కలిపి రూపొందించాం.→ డ్రింకర్ సాయి సినిమా 2019లో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ షూటింగ్ చేశాం. మొదట అనుకున్న కథకు లాక్ డౌన్ లో మరికొన్ని మార్పులు చేసి రూపొందించారు మా డైరెక్టర్ కిరణ్ గారు. ఆయన మారుతి గారి దగ్గర రైటర్ గా వర్క్ చేశారు. ఎంతో డెడికేషన్ తో ఈ సినిమాను రూపొందించారు. షూటింగ్ కంఫర్ట్ గా చేశాం.→ హీరోయిన్ ఐశ్వర్య శర్మ(Aishwarya Sharma) మంచి యాక్ట్రెస్. తను చాలా ఫోకస్డ్ గా నటించింది. చాలామంది తమ పని తప్ప మిగతా వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చుతుంటారు. ఐశ్వర్య మాత్రం ఎప్పుడూ మూవీ గురించే ప్యాషనేట్ గా వర్క్ చేసేది. బాగీ క్యారెక్టర్ లో తన పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఐశ్వర్యతో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది.→ నేను సాయి అనే క్యారెక్టర్ చేసేందుకు చాలా మంది డ్రింకర్స్ ను అబ్సర్వ్ చేశాను. నాకు డ్రింకింగ్ అలవాటు లేదు. మా డైరెక్టర్ నన్ను కొన్ని బార్స్ కు తీసుకెళ్లి తాగిన తర్వాత వాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారో చూపించారు. అలా తాగేవారి బాడీ లాంగ్వేజ్ తెలిసింది.→ డ్రింకర్ సాయి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి లవ్ స్టోరీ, మెసేజ్ కూడా ఉంటుంది. అయితే ఆడియెన్స్ ను థియేటర్స్ కు అట్రాక్ట్ చేయడం కోసం ట్రైలర్, టీజర్ లో యూత్ ఫుల్ కంటెంట్ చూపించాం.→ ప్రస్తుతం చాలా కథలు విన్నాను. త్వరలో కొత్త ప్రాజెక్ట్ వివరాలు తెలియజేస్తా.