‘డ్రింకర్‌ సాయి’ యూత్‌ను చెడగొట్టడు: హీరో ధర్మ | Young Hero Dharma Talk About Drinker Sai Movie | Sakshi
Sakshi News home page

‘డ్రింకర్‌ సాయి’ చూసి నాన్న మెచ్చుకున్నాడు: హీరో ధర్మ

Dec 24 2024 5:46 PM | Updated on Dec 24 2024 6:33 PM

Young Hero Dharma Talk About Drinker Sai Movie

నేను ఇండస్ట్రీలోకి రావడం మా నాన్నకు ఇష్టం లేదు. ఆయన వద్దన్నా నేను సినిమాల్లోకి వచ్చేశా. డ్రికంర్‌ సాయి సినిమా పూర్తయిన తర్వాత నాన్నకు చూపించాను. ఫస్ట్‌ టైం మా నాన్న నన్ను మెచ్చుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో కచ్చితంగా సక్సెస్‌ అవుతావని ఆశ్వీరదించాడు. డ్రింకర్‌ సాయి మూవీ యూత్‌ని చెడగొట్టే సినిమా కాదు. ప్రతి ఒక్కరు మెచ్చుకునే చిత్రం. సినిమా చూశాక ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకుంటారు. క్లైమాక్స్‌ హార్ట్‌ టచ్‌ చేస్తుంది’ అన్నారు యంగ్‌ హీరో ధర్మ.  ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ధర్మ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...

మాది గుంటూరులోని హనుమాన్ జంక్షన్. చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఆసక్తి ఉండేది. చిరంజీవి(chiranjeevi) గారి పాటలకు డ్యాన్స్ లు చేసేవాడిని. స్కూల్ లో ఉన్నప్పుడు నాటకాల్లో నటించాను. అలా క్రమంగా సినిమాల మీద ఇష్టం పెరిగింది. మా తాతగారు ఎగ్జిబిటర్. హనుమాన్ జంక్షన్ లో థియేటర్ ఉండేది. మా నాన్న కాకాణి బాబు సుహాసని, శోభన్ బాబు జంటగా పుణ్యదంపతులు సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా చేశారు.  మాకు కొన్ని థియేటర్స్ ఉన్నాయి. కొన్ని రోజులు ఆ థియేటర్స్ లో వర్క్ చేశా. రోజూ సినిమాలు చూస్తుండేవాడిని. నన్ను నేను తెరపై ఎప్పుడు చూసుకుందామా అని అనిపించేది. ఇంజినీరింగ్ చదివాక నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశా. లాభాలు చూశాను. ఆ తర్వాత సత్యానంద్ గారి ఇనిస్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాను. నా అభిమాన నటుడు ప్రభాస్. ఆయన నటన చూస్తే ఎంతో నాచురల్ గా ఉంటుంది. డ్యాన్సుల్లో చిరంజీవి గారి గ్రేస్ మరే హీరోకు రాదనేది నా అభిప్రాయం.

→ నేను సింధూరం అనే సినిమాలో నటించాను. నేను ఒప్పుకున్న ఫస్ట్ మూవీ డ్రింకర్ సాయి(drinker sai movie)నే. అయితే ఫస్ట్ రిలీజ్ అయ్యింది సింధూరం. ఇది నా రెండో మూవీ అయ్యింది. ఈ కథ విన్నప్పుడు ఎగ్జైట్ అయ్యాను. వాస్తవంగా ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కథ ఇది. నేను వెళ్లి ఆ వ్యక్తిని కలిశాను. అతని లైఫ్ లో జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాను. అయితే మా మూవీలో వాస్తవ ఘటనలకు కొంత ఫిక్షన్ కలిపి రూపొందించాం.

→ డ్రింకర్ సాయి సినిమా 2019లో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ షూటింగ్ చేశాం. మొదట అనుకున్న కథకు లాక్ డౌన్ లో మరికొన్ని మార్పులు చేసి రూపొందించారు మా డైరెక్టర్ కిరణ్ గారు. ఆయన మారుతి గారి దగ్గర రైటర్ గా వర్క్ చేశారు. ఎంతో డెడికేషన్ తో ఈ సినిమాను రూపొందించారు. షూటింగ్ కంఫర్ట్ గా చేశాం.

→ హీరోయిన్ ఐశ్వర్య శర్మ(Aishwarya Sharma) మంచి యాక్ట్రెస్. తను చాలా ఫోకస్డ్ గా నటించింది. చాలామంది తమ పని తప్ప మిగతా వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చుతుంటారు. ఐశ్వర్య మాత్రం ఎప్పుడూ మూవీ గురించే ప్యాషనేట్ గా వర్క్ చేసేది. బాగీ క్యారెక్టర్ లో తన పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఐశ్వర్యతో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది.

→ నేను సాయి అనే క్యారెక్టర్ చేసేందుకు చాలా మంది డ్రింకర్స్ ను అబ్సర్వ్ చేశాను. నాకు డ్రింకింగ్ అలవాటు లేదు. మా డైరెక్టర్ నన్ను కొన్ని బార్స్ కు తీసుకెళ్లి తాగిన తర్వాత వాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారో చూపించారు. అలా తాగేవారి బాడీ లాంగ్వేజ్ తెలిసింది.

→ డ్రింకర్ సాయి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి లవ్ స్టోరీ, మెసేజ్ కూడా ఉంటుంది. అయితే ఆడియెన్స్ ను థియేటర్స్ కు అట్రాక్ట్ చేయడం కోసం ట్రైలర్, టీజర్ లో యూత్ ఫుల్ కంటెంట్ చూపించాం.

→ ప్రస్తుతం చాలా కథలు విన్నాను. త్వరలో కొత్త ప్రాజెక్ట్ వివరాలు తెలియజేస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement