‘‘సీత’ సినిమా ఎలా వచ్చిందని బెంగళూరులో అడగ్గానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. మామూలుగా సినిమా చాలా బాగా వచ్చింది.. సూపర్‌గా వచ్చిందని చెబుతారు. కానీ నేను అబద్ధం చెప్పలేను.. నిజమూ చెప్పలేను.. ఎందుకంటే నిజంగా నాకు జడ్జిమెంట్ లేదు. సినిమా తీశా.. ఎక్కడ తప్పులున్నాయో అని వెతుకుతున్నా’’ అని దర్శకుడు తేజ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. మన్నారా చోప్రా మరో కథానాయిక. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో తేజ మాట్లాడుతూ– ‘‘సీత’ చిత్రం 90 శాతం బాగుంది. ఇప్పటికి కూడా సినిమా సూపరా? బాగుందా? ఏంటో మీరే చూసి చెప్పాలి. నేను సినిమా తీసేసి పరుచూరి బ్రదర్స్‌కి చూపించా. వాళ్లు చెప్పిన కరెక్షన్స్‌తో మళ్లీ షూట్ చేసి అంతా సరి చేశా. ఎందుకంటే నాది అంత ఇంటెలిజెంట్ బ్రెయిన్ కాదు యావరేజ్ బ్రెయిన్. నా కళ్లజోడు చూసి మేధావి అనుకుంటారు. కళ్లజోడు పెట్టుకున్నవాళ్లంతా మేధావులు కాదు.. కొంతమందే మేధావులుంటారు. సాయి శ్రీనివాస్, కాజల్, సోనూసూద్, అనూప్.. వీళ్లందరికీ నేను గ్రేడింగ్ ఇవ్వగలనేమో కానీ, నా గ్రేడింగ్ మాత్రం మీరే (ప్రేక్షకులు)ఇవ్వగలరు. నన్ను తిట్టినా, పొగిడినా దాన్ని సినిమాలో పెట్టేస్తా. ఎందుకంటే నాకు సినిమా తప్ప ఇంకొకటి రాదు.
హిట్లు తీసినా, ఫ్లాపులు తీసినా ఇక్కడే. ప్రేక్షకులే మాకు దేవుళ్లు.. మీరంతా బాగుండాలి’’ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రేమ, ఆదరణ పొందడానికి నేను జీవితాంతం ఇలాగే కష్టపడుతూ ఉంటా. సినిమానే నాకు ప్రాణం. సినిమా కోసం నేను ఏమైనా చేస్తా. తేజగారిలాంటి పాసొనేట్ ఫిల్మ్ మేకర్‌ను నేను లైఫ్‌లో కలవలేదు. ఇలాంటి డైరెక్టర్లను అరుదుగా చూస్తాం. నా ఆరో సినిమాకే ఇలాంటి దర్శకుడితో పని చేస్తానని అనుకోలేదు. పురుషుల కంటే మహిళలకు మేధస్సు ఎక్కువ అని చెబుతుంటాం. కానీ ప్రాక్టికల్‌గా చూపించలేదు. అందుకే అలాంటి కథతో ‘సీత’ సినిమా చేశాం’’ అన్నారు. ‘‘ఫస్ట్ టైమ్ నేను నెర్వస్ ఫీలవుతున్నా. ‘సీత’ సినిమాతో చాలా నేర్చుకున్నా. తేజగారు లేకపోతే నేను ఈ స్టేజ్‌పై ఉండేదాన్ని కాదు. ఆయన స్కూల్లోనే నేను అంతా నేర్చుకున్నా. ‘సీత’ సినిమాతో పీహెచ్‌డీ చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు కాజల్ అగర్వాల్. ‘‘నా ఫేవరెట్ లాంగ్వేజ్ ఏంటి? అని అడిగితే వెంటనే తెలుగు అని చెప్పా. నేను హిందీవాడినే అయినా నాకంటూ ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చింది తెలుగు భాషే. టాలీవుడ్ నా ఫేవరెట్ ఇండస్ట్రీ’’ అని నటుడు సోనూ సూద్ అన్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, మన్నారా చోప్రా పాల్గొన్నారు.
నాది యావరేజ్ బ్రెయిన్
Published Wed, May 22 2019 12:00 AM | Last Updated on Wed, May 22 2019 12:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment