అభినవ ‘సీత’రాముల కథ | Teja And Bellamkonda Sai Sreenivas And Kajals Sita Trailer | Sakshi
Sakshi News home page

అభినవ ‘సీత’రాముల కథ

Published Fri, May 10 2019 10:47 AM | Last Updated on Fri, May 10 2019 10:56 AM

Teja And Bellamkonda Sai Sreenivas And Kajals Sita Trailer - Sakshi

వరుసగా మాస్‌ సినిమాలు చేస్తూ సక్సెస్‌ కోసం పోరాడుతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఇన్నాళ్లు మాస్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నించినా పెద్దగా వర్క్‌ అవుట్ కాకపోవటంతో ఇప్పుడు రూట్ మార్చి ఓ లేడి ఓరియంటెడ్‌ సినిమా చేశాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ దర్శకత్వంలో సీత సినిమాలో నటిస్తున్నాడు‌. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో  కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను మే 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. సినిమాలో కీలక పాత్రలను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్‌ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.

ఇన్నాళ్లు సీరియస్‌ యాక్షన్‌ రోల్స్‌ లో కనిపించిన శ్రీనివాస్‌ ఈ సినిమా కామెడీ టచ్‌ ఉన్న పాత్రలో నటించాడు. అయితే తన మార్క్‌ యాక్షన్ మాత్రం మిస్‌ అవ్వకుండా జాగ్రత్తగా పడినట్టుగా తెలుస్తోంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్‌ రుబెన్స్‌ సంగీతమందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement