
మాస్ సినిమాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సీత. కాజల్ అగర్వాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తేజ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన సీత యూనిట్ తాజాగా సినిమాలోని మాస్ సాంగ్‌ను విడుదల చేశారు. ఆర్‌ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్‌పై చిత్రీకరించిన స్సెషల్ సాంగ్‌ను బుధవారం రిలీజ్ చేశారు. అనూప్ రుబెన్స్ సంగీత సారధ్యంలో ఉమ నేహ, తేజ సంతోష్, అమిటోలు ఆలపించిన ఈ పాటకు సురేంద్ర కృష్ణ సాహిత్యమందించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఏప్రిల్‌లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment