తమిళ టాప్ హీరో ధనుష్‌పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పుపట్టింది. దీంతో కోలీవుడ్‌లో నిర్మాతలు వర్సెస్ నడిగర్ సంఘం అనేలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. తాజాగా ధనుష్‌పై తమిళ నిర్మాతల మండలి పలు ఆంక్షలు విధించింది. కొత్త సినిమాలకు ధనుష్‌ని తీసుకునే ముందు, అతనికి అడ్వాన్సులు ఇచ్చిన్న పాత నిర్మాతలను సంప్రదించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ధనుష్‌ను టార్గెట్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది.
ధనుష్ అధికమొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకొని ఆపై షూటింగ్స్‌కి సహకరించడంలేదని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. దీంతో టీఎఫ్‌పీసీ అభ్యంతరం తెలిపింది. ఇక నుంచి ధనుష్‌తో కొత్త సినిమాను ప్రారంభించే వారు ఎవరైనా సరే ఆ నిర్మాతలు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ను సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా నిర్మాతలు ధనుషను టార్గెట్ చేయడంపై నడిగర్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధనుష్‌కు మద్ధతుగా నిలిచింది.
ధనుష్‌తో సంప్రదింపులు లేకుండానే ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధిస్తారని నడిగర్ సంఘం ప్రశ్నించింది. అందకు పలువురు నటీనటులు కూడా ధనుష్‌కు మద్ధతు ఇస్తున్నారు. తమిళ సినిమా అభ్యున్నతి కోసం అంటూ ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పుపట్టింది. సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని అనడం సరికాదని హెచ్చరించింది. నిర్మాతల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నడిగర్ సంఘం డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment