పోకెమాన్‌ కార్టూన్‌.. అప్పటినుంచే స్ట్రీమింగ్‌ | Pokémon Horizons: The Series OTT Details | Sakshi
Sakshi News home page

పోకెమాన్‌ కార్టూన్‌.. అక్కడ అప్పటినుంచే స్ట్రీమింగ్‌

Published Wed, May 22 2024 4:15 PM | Last Updated on Wed, May 22 2024 4:49 PM

Pokémon Horizons: The Series OTT Details

కొత్త పాత్రలు, సాహసాలతో కూడిన పోకెమాన్‌ హరిజన్స్‌: ది సీరీస్‌ షో వీక్షణ కోసం ప్రేక్షకులు సిద్ధం కావాలని నటులు విశాల్‌, శేఖర్‌ పిలుపునిచ్చారు. హంగామా వేదికగా ఈనెల 25వ తేదీ నుంచి ఈ యానిమేటెడ్‌ షో ప్రసారం కానుంది. పోకెమాన్‌ హరిజన్స్‌: ది సీరీస్‌లో పాత్రలు, కొత్త అంశాల గురించి నటులు విశాల్‌, శేఖర్‌ చెన్నైలో మంగళవారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో వివరించారు. 

కొత్త సాహసయాత్రతో, కొత్త పాత్రల పరిచయాలతో, ఉత్తేజకరమైన అంశాలను జోడించి ఈ షోను రూపొందించారన్నారు. ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 9.30 గంటలకు కొత్త ఎపిసోడ్‌లతో హంగామా టీవీలో సందడి నెలకొననుందని పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement