థియేటర్లలో సినిమాలు చూస్తే ఆ కిక్కే వేరప్పా అనేవాళ్లు చాలామందే! అయితే ఓటీటీలో సిరీస్‌లు, సినిమాలు చూస్తే ఆ మజానే వేరనేవారి సంఖ్య కూడా బాగానే పెరిగింది. అందుకే ఓటీటీల సంఖ్య పెరిగింది. అవి కూడా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. సినిమాలు, సిరీస్‌లు, రియాలిటీ షోలు, కామెడీ షోలు, ఇంటర్వ్యూలు.. ఇలా రకరకాల కంటెట్‌ను ఒకే ప్లాట్‌ఫామ్‌లో వండి వడ్డిస్తున్నాయి.
సంక్రాంతి సినిమాల్లో..
థియేటర్లలో విడుదలైన సినిమాలు కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. కొన్ని డిజిటల్ ఎంట్రీ గురించి ముందస్తు ప్రకటనలు చేస్తుంటే మరికొన్ని మాత్రం ఎటువంటి అప్‌డేట్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇకపోతే సంక్రాంతికి వచ్చిన సైంధవ్ ఆల్‌రెడీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా గుంటూరు కారం నేటి అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.
ఓటీటీలో నా సామిరంగ
తాజాగా నా సామిరంగ కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. త్వరలోనే నా సామిరంగ రిలీజ్ చేయనున్నట్లు హాట్‌స్టార్ వీడియో రిలీజ్ చేసింది. డేట్ మాత్రం ప్రకటించలేదు. ఇకపోతే కన్నగి అనే తమిళ చిత్రం సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే తెలుగు వర్షన్ మాత్రం ఇంకా అందుబాటులోకి వచ్చినట్లు లేదు.
KomING to set your screens on fire 🙌
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 8, 2024
Can you guess the date?#NaaSaamiRangaonHotstar #KingOnHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @actorshabeer @srinivasaaoffl @SS_Screens @boselyricist… pic.twitter.com/gsYHL1rPth
హారర్ మూవీ..
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను హడలెత్తించిన నన్ 2 కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ మూవీ ఇదివరకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. కానీ ఫ్రీగా కాకుండా అద్దెకు తీసుకుని చూడవచ్చని కండీషన్ పెట్టింది. ఇప్పుడీ చిత్రం తాజాగా జియో సినిమాలో రిలీజైంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చూడొచ్చంటూ జియో సినిమా వీడియో షేర్ చేసింది. దీంతో హారర్ చిత్రాల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 2018లో వచ్చిన నన్ మూవీకి సీక్వెల్‌గా నన్ 2 తెరకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment