The Gray Man Directors Russo Brothers Coming To India For Dhanush Drtails Inside - Sakshi
Sakshi News home page

Dhanush: ధనుష్‌ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్‌ దర్శకులు..

Published Mon, Jul 11 2022 5:47 PM | Last Updated on Mon, Jul 11 2022 6:33 PM

The Gray Man Directors Russo Brothers Coming To India For Dhanush - Sakshi

The Gray Man Directors Russo Brothers: వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌. ఆయన తెలుగులోనూ అనేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల 'మారన్'తో పర్వాలేదనిపించిన ధనుష్‌.. హాలీవుడ్‌ మూవీ 'ది గ్రే మ్యాన్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ధనుష్‌ ఫస్ట్‌ లుక్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో నెగెటివ్‌ పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్లు రూసో బ్రదర్స్‌ (జో రూసో-ఆంటోనీ రూసో) దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరూ త్వరలో ఇండియాకు రానున్నారు. అది కూడా ధనుష్ కోసం భారత్‌కు వస్తున్నట్లు వాళ్లు తెలిపారు. 

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్‌ మీట్‌లో ఇండియాకు వస్తున్నట్లు రూసో బ్రదర్స్‌ చెప్పుకొచ్చారు. ''మేం తెరకెక్కించిన కొత్త సినిమా 'ది గ్రే మ్యాన్‌' వీక్షించేందుకు, మా స్నేహితుడు ధనుష్‌ను చూసేందుకు ఇండియాకు వస్తుండటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో కలుద్దాం'' అని తెలిపారు.

చదవండి: నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్‌
నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్‌ హీరోయిన్‌
36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్‌.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్‌ హిట్‌.. 


'కెప్టెన్‌ అమెరికా: సివిల్‌ వార్', 'కెప్టెన్‌ అమెరికా: వింటర్‌ సోల్జర్‌', 'అవేంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌', 'అవేంజర్స్‌: ఎండ్‌ గేమ్‌' వంటి తదితర బ్లాక్‌ బస్టర్‌ సినిమాలకు రూసో బ్రదర్స్‌ దర్శకత్వం వహించారు. కాగా మార్క్‌ గ్రీన్‌ రాసిన పుస్తకం ఆధారంగా రూసో బ్రదర్స్‌ ఈ మూవీని తెరకెక్కించారు. సినిమాకు తగిన విధంగా జో రూసో, క్రిస్టోఫర్‌ మార్కస్‌, స్టీఫెన్‌ మెక్‌ఫీల్‌ స్క్రిప్ట్‌ రాశారు. ఈ సినిమా జులై 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement