టోలీచౌకీ కుర్రాడు.. అదరగొట్టేశాడు: రాజమౌళి ట్వీట్ వైరల్! | SS Rajamouli Appreciate Mohammad Siraj Performance In Asia Cup Final | Sakshi
Sakshi News home page

SS Rajamouli : 'ఆ విషయంలో నీది గొప్పమనసు'.. సిరాజ్‌పై దర్శకధీరుడు ప్రశంసలు!

Published Sun, Sep 17 2023 7:36 PM | Last Updated on Sun, Sep 17 2023 9:27 PM

SS Rajamouli Appreciate Mohammad Siraj Performance In Asia Cup Final - Sakshi

ఆదివారం జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో శ్రీలంకను ఊచకోత కోసిన హైదరాబాదీ మహమ్మద్‌ సిరాజ్‌పై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. నగరంలోని టోలీచౌకి బాయ్ ఆరు వికెట్లతో అద్భుతమైన బౌలింగ్ చేశాడంటూ కొనియాడారు. సిరాజ్‌ను ప్రశంసిస్తూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేయడంతో పాటు ట్వీట్ చేశారు.

(ఇది చదవండి: అలాంటి వాళ్లను పెడితే బిగ్‌బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

రాజమౌళి ట్వీట్‌ రాస్తూ.. 'సిరాజ్ మియాన్, మన టోలీచౌకీ కుర్రాడు ఆసియా కప్ ఫైనల్‌లో 6 వికెట్లతో మెరిశాడు. అంతే కాకుండాతన బౌలింగ్‌లో బౌండరీని ఆపడానికి లాంగ్-ఆన్‌కి పరిగెత్తి  అందరి హదయాలను గెలిచాడు.' అంటూ పోస్ట్ చేశారు. రాజమౌళి చేసిన ట్వీట్‌ను చూసిన అభిమానులు సైతం సిరాజ్‌ ఘనతను ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఆసియాకప్‌ ఫైనల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది. 
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement