కాల్‌ సెంటర్‌లో ఏమైంది? | Vishnu Manchu New Movie Call Centre with Sunil Shetty | Sakshi
Sakshi News home page

కాల్‌ సెంటర్‌లో ఏమైంది?

Published Mon, Sep 30 2019 12:09 AM | Last Updated on Mon, Sep 30 2019 12:09 AM

Vishnu Manchu New Movie Call Centre with Sunil Shetty - Sakshi

ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు మంచు విష్ణు. ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్పెరీ చిన్‌ దర్శకుడు. మంచు విష్ణు నిర్మాణంలోనే తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణుకి చెల్లెలిగా కాజల్‌ అగర్వాల్‌  నటిస్తున్నారు. రుహానీ సింగ్‌ హీరోయిన్‌. ఈ సినిమాకు ‘కాల్‌ సెంటర్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారని తెలిసింది. కథ కాల్‌ సెంటర్‌ చుట్టూ తిరుగుతుందా? వేచి చూడాలి.  ఇందులో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఈ సినిమా ద్వారా సునీల్‌ శెట్టి టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. పోలీస్‌ పాత్రలో సునీల్‌ శెట్టి కనిపిస్తారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement