ఎలాన్ మస్క్‌పై పిటిషన్.. ఆ రైట్స్ కల్పించాలంటున్న మాజీ భార్య! | Elon Musk Sued By Ex-Girlfriend Grimes Over Parental Rights Details - Sakshi
Sakshi News home page

Elon Musk: ఎలాన్ మస్క్‌పై పిటిషన్.. ఆ రైట్స్ కల్పించాలంటున్న మాజీ భార్య!

Published Fri, Oct 6 2023 9:46 AM | Last Updated on Fri, Oct 6 2023 11:10 AM

Elon Musk Sued By Ex Girlfriend Grimes Over Parental Rights Details - Sakshi

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌పై మాజీ భార్య గ్రిమ్స్ పిటిషన్ వేస్తూ శాన్‌ఫ్రాన్సిస్కోలోని సుపీరియర్ కోర్టుని ఆశ్రయించింది. ఇందులో తమ ముగ్గురి పిల్లల సంరక్షణను చూసుకోవాలని డిమాండ్ చేస్తూ దావా వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కెనడాకు చెందిన మ్యుజిషియన్ గ్రిమ్స్‌తో ఎలాన్ మస్క్ 2018 నుంచి 2021 వరకు డేటింగ్ చేసాడు. ఈ ఇద్దరికీ ముగ్గురు పిల్లలున్నట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చింది. మస్క్ బయోగ్రఫీ బుక్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2021 నాటికి వీరు విడిపోయారు. అప్పటి వరకు వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్న విషయం మాత్రమే చాలామందికి తెలుసు. కానీ వారిద్దరికీ మూడో బిడ్డ ఉన్నట్లు, అతని పేరు టెక్నో మెక్నానికస్ అని స్వయంగా ఎలన్ మస్క్ వెల్లడించాడు.

ముగ్గురు పిల్లల్లో ఒకరిపై తనకు ఎటువంటి అధికారాలు లేవని మస్క్ ఆరోపిస్తున్నట్లు గ్రిమ్స్‌ తెలిపింది. అంతే కాకుండా అతన్ని చూడటానికి కూడా నన్ను అనుమతించడం లేదని, తనకు కూడా ప్యారంటల్ రైట్స్ కల్పించాలని కోరింది. మస్క్‌తో డేటింగ్ చేసిన రోజుల్ని మరిచిపోలేనని చెప్పింది.

ఇదీ చదవండి: రెండు రోజుల్లో రూ. 345 కోట్లు.. టిమ్ కుక్ అంటే అట్లుంటది!

నిజానికి ఎలాన్ మస్క్‌కు ముగ్గురు భార్యలు, 11 మంది పిల్లలు. ప్రస్తుతం ముగ్గురికి విడాకులిచ్చాడు. ప్రస్తుతం గ్రిమ్స్ వేసిన ఓపిటిషన్ మీద మస్క్ స్పందించలేదు. కాగా ఇటీవల మస్క్ టర్కీ అధ్యక్షుడు 'తయ్యిప్‌ ఎర్డోగాన్‌' అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు మస్క్ అతనితో సమావేశమయ్యారు. ఆప్పుడు అతనితో తన కొడుకుని కూడా తీసుకెళ్లాడు. ఇది చూసి ఎర్డోగాన్‌ మీ భార్య ఎక్కడ అని ప్రశ్నించగా.. ఆమె శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఉందని, ప్రస్తుతం విడిపోయామని తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement