సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై చీటింగ్ కేసు నమోదైంది. నరేష్ పేరుతో పలువురు దగ్గర డబ్బులు వసూలు చేస్తోందంటూ ఆమెపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఇప్పటికే నరేశ్ ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) ఉదయం దీనిపై వివరణ ఇస్తూ ఉదయం ఓ వీడియో వదిలారు. ఈ సందర్భంగా రమ్య జరిపే వ్యాపార, ఆర్థిక వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ మరోసారి స్పష్టం చేశాడు. ‘రమ్య రఘుపతి గారి ఇష్యూ(ఫైనాన్షియల్ ఇష్యూ) బయట పడినప్పటి నుంచి నాకు మీడియా, బంధుమిత్రుల నుంచి విపరితమైన ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం మాకు పెళ్లైయింది.
చదవండి: స్పిరిట్ కంటే ముందు ‘రాజా డీలక్స్’ను సెట్స్‌పై తీసుకొచ్చే ప్లాన్‌లో ప్రభాస్?
మనస్పర్థల కారణంగా రెండూ, మూడేళ్లకే విడిపోయాం. ఇలాంటివి జరుగుతాయనే భయంతోనే ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అనంతపురం, హిందూపురం ఇష్యూ తర్వాత ఇలాంటివి భవిష్యత్తులో వస్తాయానే ఉద్దేశంతోనే 2, 3 నెలల క్రితమే ఓ ప్రకటన ఇచ్చాను. తనతో నాకు గాని, నా కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదని, ఆర్థికంగా కూడా. ఈ సమస్య ఎంత దూరం వెళుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో అందరూ భయంతో ఉన్నారు. డబ్బు తీసుకోవడం, మోసం చేయడం వంటివి ఇంతవరకు మా కుటుంబాల్లో ఎక్కడ లేదు. నేను చెప్పేదే ఒక్కటే రమ్య రఘపతి కేసులో నాకు, నా కుటుంబ సభ్యుల ప్రమేయం ఏం లేదు’ అంటూ వివరణ ఇచ్చారు.
చదవండి: 11వ బిడ్డకు జన్మనివ్వబోతోన్న ప్రముఖ సింగర్
నటుడు నరేష్‌కు రమ్య రఘుపతి మూడో భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె ఈమె. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. అయితే కొన్నాళ్ల క్రితం మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే నరేష్ సహా ఆయన కుటుంబంతో దిగిన ఫోటోలను అడ్డు పెట్టుకొని కొందరు మహిళల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నరేష్‌కు చెందిన ఆస్తులను తన ఆస్తులుగా చెప్పి అధిక వడ్డీ పేరుతో, రిజిస్ట్రేషన్ల పేరుతో కోట్లల్లో మోసానికి పాల్పడింది. దీనిపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment