
వెనమ్(VenoM), మ్యాడ్‌మాక్స్ ఫ్యూరీ రోడ్.. ఫేమ్ హాలీవుడ్ హీరో టామ్ హార్డీ(ఎడ్వర్డ్ థామస్) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. హీరోగా పేరు తెచ్చుకొని మళ్లీ పాపులర్ అవడం ఏంటని డౌట్ వద్దు. విషయంలోకి వెళితే.. మార్షల్ ఆర్ట్ కాంపిటీషన్‌లో పాల్గొన్న టామ్ హార్డీ ఏకంగా గోల్డ్ మెడల్ కొల్లగొట్టడం విశేషం.
45 ఏళ్ల వయసులో మార్షల్ ఆర్ట్స్‌లోకి ఎంటరైన టామ్ హార్డీ 2022 బ్రెజిలియన్ జియు-జిట్సు ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. సెప్టెంబర్ 17న అల్టిమేట్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ ఆధ్వర్యంలో మిల్టన్ కీన్స్‌లోని ఓక్‌గ్రోవ్ స్కూల్‌లో ఈ పోటీని నిర్వహించారు. నీలిరంగు దుస్తులు ధరించిన టామ్ హార్డీ.. తన అసలు పేరు ఎడ్వర్డ్ థామస్‌గా బరిలోకి దిగడం విశేషం. కాగా పోటీలో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వని టామ్ హార్డీ పట్టుతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక టామ్ హార్డీ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్‌లో పాల్గొనడంపై మ్యాచ్ నిర్వాహకులు స్పందించారు. టామ్ హార్డీ చాలా మంచి వ్యక్తి. అతని యాక్టింగ్ తెలిసిన ప్రతీ ఒక్కరు గుర్తుపడతారు. మేం పిలిచిన వెంటనే ఒక గెస్ట్‌గా హాజరవడమే గాక మ్యాచ్ ఆడడంతో పాటు అభిమానులకు ఫోటోలు ఇవ్వడం అతని మంచి మనుసును తెలియజేస్తుంది. ఇలాంటి ఈవెంట్‌కు టామ హార్డీ రావడం మా అదృష్టం అని పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం గోల్డ్ మెడల్‌తో పాటు సర్టిఫికేట్ పొందిన టామ్ హార్డీ మాట్లాడాడు. ''ఈ విజయం వర్ణించలేనిది.. ఎందుకంటే నేనింకా షాక్‌లోనే ఉన్నా.. ఏం మాట్లాడాలో తెలియడం లేదు'' అంటూ పేర్కొన్నాడు.
Tom Hardy just casually submitting people at 45 years old pic.twitter.com/pLpYvH1Rj4
— Out Of Context MMA (@oocmma) September 21, 2022
Comments
Please login to add a commentAdd a comment