Hollywood The Godfather Actor James Caan Died At Age Of 82 - Sakshi
Sakshi News home page

Actor James Caan Death: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ‘గాడ్‌ ఫాదర్‌’ నటుడు మృతి

Published Fri, Jul 8 2022 4:23 PM | Last Updated on Fri, Jul 8 2022 4:43 PM

Hollywood Actor James Caan Died At Age Of 82 - Sakshi

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమల్లో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు రోజులుగా టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ప్రముఖులు మృత్యువాత పడ్డారు. వారి మరణవార్త నుంచి బయటపడక ముందే తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జేమ్స్‌ కాన్‌(82) శుక్రవారం కన్నుమూశారు. అమెరికాలోని లాస్‌ ఎంజిల్స్‌లో నివాసం ఉంటున్న జేమ్స్‌ నేడు ఉదయం తుదిశ్వాస విడిచనట్లు ఆయన కుటుంబసభ్యులు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

చదవండి: ‘ఏంటీ.. మహేశ్‌ సినిమాకు పూజా కండిషన్స్‌ పెట్టిందా?’

‘బుధవారం (జూలై 6) సాయంత్రం జిమ్మీ కన్నుమూశారనే విషయాన్ని తెలియజేయడానికి మేం చింతిస్తున్నాం’ అని జేమ్స్ ఫ్యామిలీ ట్వీట్‌ చేసింది. అలాగే ఆయన మేనేజర్‌ స్పందిస్తూ ‘జేమ్స్‌ చాలా గొప్పవాడు. చాలా సరదాగా ఉంటారు. అందరితో ప్రేమగా ఉండే ఆయన ఇకలేరు అంటే నమ్మలేకపోతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని పార్థిస్తున్నా’ అంటూ మీడియాకు చెప్పుకొచ్చాడు.  కాగా గాడ్‌ ఫాదర్‌ చిత్రంతో గుర్తింపు పొందిన జేమ్స్‌ కాన్‌ మిజరీ, ఎల్ఫ్ వంటి తదితర చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. అంతేకాదు పలుమార్లు ఆయన ఆస్కార్‌ అవార్డుకు కూడా నామినేట్‌ అయ్యారు. 

చదవండి:  హీరో విక్రమ్‌కు గుండెపోటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement