![Youtube Star Shriya Muralidhar Died At Age 27 Due To Cardiac Arrest - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/8/shriya-muralidhar.jpg.webp?itok=H70Tv6R3)
youtube Star shreya Muralidhar(27) Last Breath Due To Cardiac Arrest: ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శ్రియా మురళిధర్(27) మృతి చెందారు. సోమవారం(డిసెంబర్ 7) రాత్రి గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. నిన్న అర్థరాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానికి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణంచినట్లు వైద్యలు స్పష్టం చేశారు. యూట్యూబ్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న శ్రియా మురళీధర్… యాంకర్ ప్రదీప్ రియాలిటీ షో ‘పెళ్లి చూపులు’లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించింది. యాంకర్‌గా కూడా పలు కార్యక్రామాల్లో మెప్పించేది.
చదవండి: సోషల్ మీడియాలో చేదు అనుభవం, బోల్డ్‌గా స్పందించిన హీరోయిన్
ఇక ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2లో ఓ పాత్ర చేసింది. ‘వాట్ ద ఫన్’ అనే యూట్యూబ్ ఛానల్‌లో ఆమె చేసిన వీడియోలు.. నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే వెండితెరపై కనిపించాలని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా ఈ యంగ్ యూట్యూబర్ అర్థాంతరంగా చనిపోవడం పలువురి బాధిస్తోంది. శ్రీయా మురళీధర్ స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్. కాగా శ్రీయా మృతి పట్ల యూట్యూబ్ స్టార్ దీప్తీ సునైనా, సినీ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ చెర్రీతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment