Hollywood Actor Darren Kent of 'Game of Thrones' fame passes away - Sakshi
Sakshi News home page

Darren Kent: ప్రముఖ హాలీవుడ్‌ నటుడు కన్నుమూత..

Published Wed, Aug 16 2023 10:21 AM | Last Updated on Wed, Aug 16 2023 10:57 AM

Hollywood Actor Darren Kent Passed Away - Sakshi

ప్రముఖ హాలీవుడ్ నటుడు డారెన్ కెంట్ (39) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం (ఆగస్టు 11న) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను ఆయన సన్నిహితులు ఆలస్యంగా మీడియాకు వెల్లడించారు. కాగా డారెన్‌ కెంట్‌ ఇంగ్లాండ్‌లోని ఎస్సెక్స్‌లో జన్మించారు. 2007లో ఇటాలియా కాంటిలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆయన ఆ మరుసటి ఏడాది మిర్రర్స్‌ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు.

ద లిటిల్‌ స్ట్రేంజర్‌ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించారు. 'Game of Thrones' సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఈ సిరీస్‌ ఇతడికి విశేషమైన క్రేజ్‌ తెచ్చిపెట్టింది.  దీనితోపాటు అనేక HBO డ్రామా సిరీస్‌లలోనూ నటించారు. సన్నీబాయ్ సినిమాకు గాను కెంట్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement